Begin typing your search above and press return to search.

చాలా కాలం తర్వాత వచ్చిన సినీ లెజెండ్‌ మనవడు

By:  Tupaki Desk   |   13 April 2022 2:30 AM GMT
చాలా కాలం తర్వాత వచ్చిన సినీ లెజెండ్‌ మనవడు
X
తమిళ సినీ పరిశ్రమ బతికి ఉన్నంత కాలం శివాజీ గణేషన్‌ గుర్తిండి పోతాడు అనడంలో సందేహం లేదు. తమిళ సినీ పరిశ్రమ లో ఆయన వారసుడిగా ప్రభు పరిచయం అయ్యి మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. ఈ సమయంలోనే ప్రభు తనయుడు విక్రమ్‌ ప్రభు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను దక్కించుకున్నాడు.

హీరోగా పరిచయం అయిన విక్రమ్‌ ప్రభు కు కమర్షియల్ గా బిగ్ బ్రేక్ దక్కలేదు. కాని ఆయన కెరీర్‌ లో సినిమాలు మాత్రం కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. అయితే కరోనా ఇతర కారణాల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో ఉన్న జోరు తగ్గడంతో మనోడు మళ్లీ గాడిన పడేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఈ ఏడాది వరుసగా సినిమాలతో విక్రమ్‌ ప్రభు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

తెలుగు లో కూడా ఈయన గతంలో నటించిన తమిళ సినిమా లు కొన్ని డబ్బింగ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని మంచి టాక్ ను దక్కించుకున్నాయి. ఇప్పుడు తమిళంలో తానక్కారన్ అనే సినిమా ను విక్రమ్‌ ప్రభు చేశాడు. ఆ సినిమా ను తెలుగు లో పోలీసోడు అనే టైటిల్ తో డబ్బింగ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఏప్రిల్‌ 8వ తారీకున స్ట్రీమింగ్‌ మొదలు అయిన ఈ సినిమా కు మంచి స్పందన వచ్చింది. తెలుగు లో కూడా ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు లో ఈ సినిమాను భారీగా ప్రమోషన్ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఓటీటీ ద్వారా పోలీసోడు సినిమాను చూసేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఈమద్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో వరుసగా భారీ చిత్రాలు.. మంచి కాన్సెప్ట్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో పోలీసోడు స్ట్రీమింగ్‌ అవ్వడం వల్ల అత్యధికులు చూసే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.