Begin typing your search above and press return to search.

ఆ పాన్ ఇండియా సినిమా పూర్తయ్యాకే .. విక్రం కొత్త సినిమా

By:  Tupaki Desk   |   15 Dec 2020 5:00 PM IST
ఆ పాన్ ఇండియా సినిమా పూర్తయ్యాకే .. విక్రం కొత్త సినిమా
X
తమిళ నాట కమలహాసన్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి చియాన్ విక్రం. వరుసగా విక్రం ప్రయోగాత్మక సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తు తం జ్ఞాన ముత్తు దర్శకత్వంలో విక్రం కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విక్రం ఏకంగా ఎనిమిది పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ తెగ ఆకట్టుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం బాహుబలి రేంజ్ లో పొన్నియన్ సెల్వం అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నటించేందుకు విక్రం ఇది వరకే అంగీకరించాడు. అయితే ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు విక్రం అంగీకారం తెలిపారట.

ఇందులో విక్రంతో పాటు ఆయన తనయుడు ధృవ్ కి కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ధృవ్ ఇటీవలే అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు ముందు డేట్స్ ఇచ్చేది విక్రం తేల్చలేదు. అయితే ముందుగా చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న పొన్నియన్ సెల్వంలో నటించనున్నట్లు సమాచారం. పొన్నియన్ సెల్వం ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో కార్తి, జయం రవి, విక్రం ప్రభు, ఐశ్వర్య రాయ్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ మూవీ తిరిగి షూటింగ్ మళ్ళీ మొదలవబోతోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో షూట్ మొదలు పెట్టనున్నారు. పాన్ ఇండియా కేటగిరిలో భారీ బడ్జెట్ తో తెరకె క్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా కొన్నేళ్ళుగా హిట్ కోసం తహ తహలాడుతున్న విక్రంకి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.