Begin typing your search above and press return to search.
తేజ హీరోయిన్ పై కన్నేసిన విక్రమ్
By: Tupaki Desk | 17 Jun 2016 11:00 PM ISTయూత్ ను టార్గెట్ చేసి తేజ తీసిన సినిమాలు కొన్ని హిట్టయ్యాయి... మరికొన్ని ఫట్టయ్యాయి. అయితే అందులో నటించిన హీరోయిన్లకు మాత్రం మంచి కెరీరే బిల్డప్ అయింది. టాలీవుడ్.. కోలీవుడ్లలో బాగానే రాణించారు తేజ హీరోయిన్లు. అందులో రీమాసేన్... అనిత... సదా... కాజల్ అగర్వాల్.. నందితలు టాలీవుడ్లో బాగా రాణించారు. కొందరు రాణిస్తున్నారు. రెండు ఇండస్ట్రీలలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. వీరిలో బాతుగుడ్ల భామ నందిత మినహాయిస్తే.. మిగిలిన వారంతా కోలీవుడ్ లో స్టారోలతో కలిసి నటించి తమ సత్తా చాటారు.
కోలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే రీమాసేన్ - అనిత - సదా.. చియాన్ విక్రమ్ పక్కన నటించే అవకాశం కొట్టేశారు. అయితే చందమామ కాజల్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం అయినా.. విక్రమ్ తో నటించలేదు. ఇప్పుడు ఆ చాన్స్ కొట్టేసింది ఈ పంజాబీ గాళ్. 'గరుడ' పేరుతో తెరకెక్కనున్న ఓ సినిమాలో విక్రమ్‌తో కలిసి నటించబోతోంది. తేజ హీరోయిన్స్ తో నటించినప్పుడల్లా విక్రమ్ కి బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయి. మరి అసలే ఫ్లాపులతో వున్న విక్రమ్ కి ఈసారి కూడా కలిసొస్తుందేమో చూడాలి.