Begin typing your search above and press return to search.

విక్రమ్ ఓటీటీ డీల్.. వచ్చేది ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   4 Jun 2022 7:31 AM GMT
విక్రమ్ ఓటీటీ డీల్.. వచ్చేది ఎప్పుడంటే?
X
కమల్ హాసన్ విక్రమ్ సినిమా మొత్తానికి చాలా కాలం తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. ముఖ్యంగా తమిళంలో అయితే విక్రమ్ సినిమా కమలహాసన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. సినిమా మీద అపారమైన నమ్మకం తోనే కమల్ హాసన్ పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.

కానీ సినిమాకు తెలుగు తమిళంలోనే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే సినిమా ఈ వీకెండ్ లో భారీ స్థాయిలోనే కలెక్షన్స్ అందుకనేలా ఉంది అనిపిస్తుంది.

ఈ సినిమాలో కేవలం కమల్ హాసన్ మాత్రమే కాకుండా ప్రముఖ నటులు విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దానికితోడు స్టార్ హీరో సూర్య కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన గెస్ట్ పాత్రలో కనిపించడం హైలెట్ గా నిలిచింది.

దీంతో ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనే విషయం లోకి వెళితే.. విక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను అయితే హాట్ స్టార్ డిస్ని ప్లస్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో స్టార్ మా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. హాట్ స్టార్ లో విక్రమ్ సినిమా ఆరు వారాల తర్వాత నే విడుదల అయ్యే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

అంటే జూలై మొదట్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాపై నమ్మకంతో తెలుగులో కూడా నితిన్ హోమ్ బ్యానర్ లో భారీస్థాయిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

చూస్తుంటే సోమవారం నాటికి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కూడా అనిపిస్తోంది. మరి మొత్తంగా విక్రమ్ సినిమా నిర్మాతలకు ఏ స్థాయిలో లాభాలు అందిస్తుందో చూడాలి.