Begin typing your search above and press return to search.
మెగా కాంబినేషన్.. రిలీజ్ ఆ రోజే?
By: Tupaki Desk | 7 March 2022 8:00 AM ISTఇప్పుడు తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం కోసం అక్కడి ప్రేక్షకులే కాక.. వేరే భాషలకు చెందిన ఆడియన్స్ సైతం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా కాంబినేషన్ అంతగా ఆసక్తి రేకెత్తిస్తోంది మరి. అందులో హీరో కమల్ హాసన్ అయితే.. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముగ్గురూ మామూలుగా విడి విడిగా చేసే సినిమాల మీదే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
ఒక్కొక్కరికీ అంత మంచి ఇమేజ్ ఉంది. అలాంటిది ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయడం.. ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ ఈ మెగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మామూలుగా లేదు. కమల్-లోకేష్ కలయికలో 'విక్రమ్' సినిమాను అనౌన్స్ చేసినపుడే అంచనాలు పెరిగిపోగా.. ఇందులో విజయ్, ఫాహద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారనే సరికి అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని అంతా ఉత్కంఠతో ఉన్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని వేసవి విడుదలకు ఈ సినిమా సిద్ధమైంది. ఈ నెల 14న 'విక్రమ్' రిలీజ్ డేట్‌ను ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఐతే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి తమిళ మీడియాలో ముందే వార్తలు వచ్చేశాయి.
మే 26న 'విక్రమ్' మూవీని విడుదల చేయాలని ఫిక్సయ్యారట. ఏప్రిల్లో విజయ్ సినిమా 'బీస్ట్' విడుదల కాబోతోంది. ముందు ఏప్రిల్ 14న 'బీస్ట్' రిలీజ్ అనుకున్నారు కానీ.. అదే రోజు 'కేజీఎఫ్-2' రాబోతుండటంతో విజయ్ మూవీని రెండు వారాలు వాయిదా వేసే అవకాశముంది. ఆ చిత్రం నెలాఖర్లో రిలీజవుతుందని అంచనా.
ఆ తర్వాత ఇంకో మూణ్నాలుగు వారాలు గ్యాప్ ఉండేలా చూసుకుని మే 26న 'విక్రమ్'ను రిలీజ్ చేయాలని ఫిక్సయినట్లు సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం పెద్ద స్థాయిలోనే రిలీజయ్యే అవకాశముంది. మే 27న తెలుగులో 'ఎఫ్-3', 'మేజర్' సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే.