Begin typing your search above and press return to search.
మూడేళ్ళ తరువాత హిట్టుబొమ్మ
By: Tupaki Desk | 12 Jun 2022 10:00 PM ISTఇటీవల కాలంలో సినిమాలకు సంబంధించిన సక్సెస్ రేట్ అయితే చాలా వరకు తగ్గింది అనే చెప్పాలి. ఒక ఏడాదిలో 100 సినిమాలు రిలీజ్ అయితే అందులో పది మాత్రమే సక్సెస్ అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో అయితే సక్సెస్ టాక్ను సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఒక అంచనాలను అందుకోకపోవడంతో దారుణంగా నష్టాలను కలిగిస్తున్నాయి. ఒక సినిమా సక్సెస్ అయింది అనడానికి కలెక్షన్స్ కంటే మరొక ఉదాహరణ ఏమీ ఉండదు.
ఆ విధంగా చూసుకుంటే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు నెలల్లో చాలా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. గడిచిన మూడేళ్లలో అక్కడ ఒక్క హిట్టు బొమ్మ కూడా పడలేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక పెట్టిన పెట్టుబడికి భారీస్థాయిలో లాభాలను అందించిన తమిళ సినిమాల్లో ఇటీవల కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి.
2019లో అజిత్ నుంచి వచ్చిన విశ్వాసం సినిమా మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాలు వచ్చాయి. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం పెద్దగా ఆశ్చర్యపరిచిన సినిమా రాలేదు. అయితే కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఒక కొత్త బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. ఆ సినిమా తమిళ ఇండస్ట్రీలో 73 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోవడం విశేషం.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు లభిస్తుంది. మలయాళంలో కూడా భారీ స్థాయిలోనే కలెక్షన్స్ అందుతున్నాయి. సౌత్ లో 100కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. ఇక హిందీ వెర్షన్ లో మాత్రం విక్రమ్ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఏదేమైనా కూడా పెట్టిన పెట్టుబడికి విక్రమ్ సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తుంది. కమల్ హాసన్ చాలా రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ చూశాడు. ఇక ఈ సినిమా తర్వాత తమిళంలో నటించిన మరికొన్ని సినిమాలు కూడా విక్రమ్ తరహాలోనే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాయి.