Begin typing your search above and press return to search.

క్రేజీ ట్రిపుల్‌ స్టారర్‌ మూవీ గ్లిమ్స్‌ ముహూర్తం ఫిక్స్‌

By:  Tupaki Desk   |   5 Nov 2021 10:00 PM IST
క్రేజీ ట్రిపుల్‌ స్టారర్‌ మూవీ గ్లిమ్స్‌ ముహూర్తం ఫిక్స్‌
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఒక్కడు నటిస్తేనే ఆ సినిమా పై అంచనాలు సౌత్‌ ఇండియా మొత్తం భారీ ఎత్తున ఉంటాయి. అలాంటిది కమల్‌ హాసన్‌ తో పాటు ఈమద్య కాలంలో పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ దక్కించుకున్న ఫాహద్ ఫాజిల్‌ మరియు విజయ్‌ సేతుపతిలు కూడా ఆ సినిమాలో నటిస్తే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముగ్గురు కూడా నటన విషయంలో ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రతిభ ఉన్న వారు. ఒక సన్నివేశం అద్బుతంగా రావడం కోసం ఈ ముగ్గురు ఎంతకైనా తెగిస్తారు.. ఏం చేసేందుకు అయినా సిద్ద పడుతారు అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ ముగ్గురు కలిసి 'విక్రమ్‌' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు ఈమద్య కాలంలో మోస్ట్‌ క్రేజీ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఏ విధంగా చూసినా కూడా ఈ సినిమా నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంటుందని తమిళ.. మలయాళం మరియు తెలుగు సినీ అభిమానులు నమ్ముతున్నారు. ముగ్గురు స్టార్స్ కలిసి నటించే సినిమా అంటే ఖచ్చితంగా మామూలు విషయం కాదు. అద్బుతమైన కథతో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడనే విషయం అందరికి తెల్సిందే. ఆమద్య ప్రారంభం అయిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్.. ఆన్ లొకేషన్‌ స్టిల్స్ అంటూ చాలానే వచ్చాయి. కాని కమల్‌ హాసన్ పుట్టిన రోజు సందర్బంగా సినిమా అభిమానులు మరియు కమల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విక్రమ్‌ గ్లిమ్స్ వీడియో రాబోతుంది. కమల్‌ పుట్టిన రోజు సందర్బంగా రేపు సాయంత్రం 6 గంటల సమయంలో విక్రమ్ గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ ప్రకటించాడు.

కమల్‌ హాసన్‌ మాత్రమే ఈ గ్లిమ్స్ లో ఉంటాడా లేదా ముగ్గురు హీరోలకు సమాన ప్రాముఖ్యతను కలిగిస్తారా అనేది చూడాలి. అనిరుథ్‌ సంగీత సారథ్యంలో రూపొందిన గ్లిమ్స్ ను ఇప్పటికే తమిళ మీడియా వర్గాల వారు కొందరు చూసినట్లుగా చెబుతున్నారు. అద్బుతంగా వచ్చింది వీడియో... అనిరుథ్‌ నేపథ్య సంగీతం చాలా బాగుందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి మరియు ఫాహద్ ఫాజిల్ లు విలన్స్ గా నటిస్తున్నారా లేదంటే కీలక పాత్రలో కనిపించబోతున్నారా అనే విషయంలో ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యులు స్పష్టతను ఇవ్వలేదు. గ్లిమ్స్ లో ఆ విషయమై ఏమైనా క్లారిటీ వచ్చేనో చూడాలి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ విషయంలో త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.