Begin typing your search above and press return to search.

విశ్వనటుడి 'విక్రమ్' ఫస్ట్ గ్లాన్స్ వచ్చేసింది..!

By:  Tupaki Desk   |   6 Nov 2021 2:01 PM GMT
విశ్వనటుడి విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ వచ్చేసింది..!
X
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'ఖైదీ' 'మాస్టర్' సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ - ఫస్ట్ గ్లిమ్స్ విశేషంగా అలరించాయి. కమల్ - సేతుపతి - ఫహాద్ లతో కూడిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో నేడు (నవంబర్ 6) కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లాన్స్ ను గిఫ్ట్ గా అందించారు మేకర్స్.

'విక్రమ్' ఫస్ట్ గ్లాన్స్ వీడియోలో కొందరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ..కమల్‌ హాసన్‌ తన టీమ్‌ తో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమల్ ను ఇంతకు ముందెప్పుడూ, ఏ దర్శకుడూ చూపించని విధంగా వినూత్నమైన పద్ధతిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపిస్తున్నట్లు అర్థం అవుతుంది. అలానే లోకనాయకుడు ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ అని హింట్ ఇచ్చారు. 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా గూస్ బమ్స్ కలిగించేలా ఉంది. కెమెరామెన్ గిరీష్‌ గంగాధరన్‌ విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి - ఫహాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటిస్తున్న 'విక్రమ్' సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

'విక్రమ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కమల్ హాసన్ - ఫహాద్‌ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెట్ లోనే చిత్ర యూనిట్ కమల్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు - అరివ్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.