Begin typing your search above and press return to search.

సెకండ్ లుక్: విక్రమ్ కదరం కొండన్

By:  Tupaki Desk   |   30 Dec 2018 10:34 AM IST
సెకండ్ లుక్: విక్రమ్ కదరం కొండన్
X
తమిళ హీరో విక్రమ్ ప్రస్తుతం 'కదరం కొండన్' అనే సినిమాలో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. 'చీకటి రాజ్యం' ఫేమ్ రాజేష్ సిల్వ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విక్రమ్ డిఫరెంట్ గెటప్ అందరినీ మెప్పించింది.

తాజాగా ఈ సినిమానుండి నిర్మాతలు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్ జనవరి 15 వ తారీఖున రిలీజ్ కానుందని వెల్లడించారు. విక్రమ్ లుక్స గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటాం.. సింపుల్ గా సూపర్బ్ అంతే. మొహికన్ హెయిర్ స్టైల్ లో.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మీసాలు గెడ్డం పెంచి డిఫరెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా హాలీవుడ్ ఫిలిం 'డోంట్ బ్రీథ్' కు రీమే క్ గా తెరకెక్కుతోందట. ఈ సినిమాను పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారని.. ఇందులో విక్రమ్ విదేశీ పోలీసు పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

ఈ మధ్య విక్రమ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించడం లేదు. దాదాపు ఈ పదేళ్ళలో 'ఇంకొక్కడు'(ఇరుముగన్) తప్ప మరో సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. మరి ఈ సినిమాతో అయినా విక్రమ్ ఒక సాలిడ్ హిట్ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.