Begin typing your search above and press return to search.

విక్రమ్ కుమార్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   6 Jun 2016 7:44 AM GMT
విక్రమ్ కుమార్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడా?
X
ఇష్క్.. మనం.. 24 లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్ కుమార్. అతడి సినిమాలు చూసినా.. అతడి మాటలు విన్నా.. అతడి ప్రవర్తన చూసినా చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. వయసులో కూడా విక్రమ్ పెద్దవాడిలాగే కనిపిస్తాడు. ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విక్రమ్ కు ఇప్పటిదాకా పెళ్లి కాలేదట. నిన్న శ్రీనిధి అనే సౌండ్ ఇంజినీర్ తో అతడికి ఎంగేజ్ మెంట్ అవ్వడం చూసి చాలామంది షాకయ్యారు.

విక్రమ్ ఇప్పటిదాకా సింగిలా.. ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడా అని ఆశ్చర్యానికి గురయ్యారు. విశేషం ఏంటంటే.. విక్రమ్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘24’ సినిమా చేస్తున్న సమయంలోనే శ్రీనిధి అతడికి పరిచయమైంది. ఆమె లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ టీంలో సౌండ్ ఇంజినీర్ గా పని చేస్తోంది. ‘24’ కోసం పని చేస్తున్న సమయంలోనే శ్రీనిధితో విక్రమ్ కు పరిచయమై .. ఇద్దరి అభిరుచులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా పూర్తిచేసిన ఈ జంట ఈ సెప్టెంబరులో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆ తర్వాతే తన నెక్స్ట్ మూవీని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నాడు విక్రమ్. ‘ఇష్టం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్.. ఆ తర్వాత తమిళంలో ఓ ఫ్లాప్ మూవీ తీశాడు. ఆపై ‘13 బి’తో లైమ్ లైట్లోకి వచ్చాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విక్రమ్ ‘ఇష్క్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మళ్లీ పలకరించాడు. ఆపైన ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.