Begin typing your search above and press return to search.

విక్రమ్ పంచ్ అతడికేనా?

By:  Tupaki Desk   |   16 May 2016 7:30 PM GMT
విక్రమ్ పంచ్ అతడికేనా?
X
మనం సినిమాతో ప్రతీ తెలుగు ప్రేక్షకుడి మన్ననలను అందుకున్న విక్రమ్ కుమార్ ఇప్పుడు 24 చిత్రంతో తెలుగుతో పాటూ తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని గత రెండు చిత్రాలకు ఇప్పుడు హిందీలో భారీ గిరాకీ వుండడం విశేషం.

ఈ సినిమాలను హిందీలో రీమేక్ చెయ్యాలని, దాన్ని విక్రమే డైరెక్ట్ చెయ్యాలని పెద్ద పెద్ద సంస్థలు కోరుతున్నా చెప్పిన కధనే మరోసారి చెప్పడంకోసం కాలాన్ని వృధా చెయ్యడం తనకి ఇష్టంలేక ఈ రిక్వెస్ట్ లను హోల్డ్ లో పెట్టాడట.

తన సినిమా కధలు పేపర్ మీద ఎంతో కష్టంగా వున్నా తెరకెక్కించే సరికి సామాన్య ప్రేక్షకుడికి కూడా చాలా సులువుగా అర్ధమవుతాయి. ఈ విషయంలో దర్శకుడు స్పందిస్తూ మనం చేసే సినిమాలు మన ఇంటిలిజెన్స్ ని తెలపకూడదని, దాని వెనుక దాగున్న ఎమోషన్లను తెలపాలని జవాబిచ్చాడు. ఈ పంచ్ టాలీవుడ్ లో మోస్ట్ ఇంటిలిజెంట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరొంది గత రెండు సినిమాలు ఆశించినంత విజయాన్ని సాధించని దర్శకుడిమీద వేసిందేనని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ పేరేంటో మేము ప్రస్తావించక్కర్లేదు అనుకుంటగా.