Begin typing your search above and press return to search.

మహేష్, బన్నీలతో చేస్తున్నా- విక్రమ్

By:  Tupaki Desk   |   10 Dec 2015 6:11 AM GMT
మహేష్, బన్నీలతో చేస్తున్నా- విక్రమ్
X
ఇష్క్, మనం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు విక్రమ్ కె.కుమార్. ఆ తర్వాత తెలుగులో తనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు లైన్లో ఉన్నా.. సూర్యతో ‘24’ తీయడం కోసం కోలీవుడ్ కు వెళ్లిపోయాడు విక్రమ్. ఆ సినిమా పూర్తయిపోయింది. వేసవిలో విడుదల కాబోయే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీని తర్వాత విక్రమ్ చేయబోయే సినమా ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అతను అల్లు అర్జున్ తో సినిమా చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ పక్కాగా ఏ విషయం తెలియదు. ఐతే ఈ సందేహాలకు స్వయంగా విక్రమే జవాబిచ్చాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించాడు.

ఓ ప్రముఖ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. 24 తర్వాత తాను చేయబోయే రెండు సినిమాలూ తెలుగు హీరోలతోనే ఉంటాయని తెలిపాడు. ఒకటి మహేష్ బాబుతో, మరొకటి అల్లు అర్జున్‌ తో చేస్తానని వెల్లడించాడు. ఐతే ఏది ముందు ఏది తర్వాత అన్నది చెప్పలేనన్నాడు. ఇవి తెలుగు ప్రేక్షకులకు చాలా సంతోషాన్నిచ్చే విషయాలే. విక్రమ్ లాంటి డైరెక్టర్.. మహేష్, బన్నీ లాంటి వాళ్లతో జత కడితే చాలా మంచి సినిమాలే వస్తాయి. విక్రమ్ - మహేష్ కలిసి ఓ సినిమా చేస్తారని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ అప్పట్లో ఆ ప్రాజెక్టు సాధ్యం కాలేదు. ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చేస్తున్న మహేష్.. వచ్చే వేసవి నుంచి మురుగదాస్ సినిమా చేయాల్సి ఉంది. ఐతే విక్రమ్ ఫ్రీ అయ్యే సమయానికే బన్నీ కూడా రెడీగా ఉంటాడు కాబట్టి.. వీళ్లిద్దరి కాంబినేషనే ముందు తెరపైకి వచ్చే అవకాశముంది.