Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్.. సమంత మాయలో పడిపోయాడు

By:  Tupaki Desk   |   20 Dec 2015 4:33 AM GMT
ఆ డైరెక్టర్.. సమంత మాయలో పడిపోయాడు
X
ముందు గౌతమ్ మీనన్ ఆమె మాయలో పడ్డాడు. ‘ఏమాయ చేసావె’ తీశాడు.. అందరినీ మాయలో పడేశాడు. ప్రేక్షకులే కాదు.. హీరోలు, దర్శకుల్లో కూడా చాలామంది సమంత మాయలో పడిపోయి వరుసగా ఆమెతోనే సినిమాలు చేశారు. ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ సమంత మాయలో చిక్కుకున్నాడు. అతనెవరో కాదు.. విక్రమ్.కె.కుమార్. ‘మనం’ సినిమాతో తొలిసారి సమంతతో పనిచేసిన విక్రమ్.. ఆ సినిమాలో ఆమె పెర్ఫామెన్స్ కు ఫిదా అయిపోయి.. తన తర్వాతి సినిమా ‘24’లోనూ అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి ప్రేక్షకులు షాకవడం ఖాయం అంటూ మురిసిపోతోంది సమంత.

ఐతే ‘24’ సినిమాతో విక్రమ్-సమంతల కాంబినేషన్ ఆగిపోవట్లేదు. సమంత హీరోయిన్‌ గా మరో సినిమా తీయబోతున్నాడట విక్రమ్. మహేష్ - అల్లు అర్జున్ లతో సినిమా చేస్తానని ప్రకటించిన విక్రమ్.. వాటితో పాటు సమంత ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇందులో ఓ ఫేమస్ హీరో కూడా నటిస్తాడని.. ఐతే సమంతదే ప్రధాన పాత్ర అని చెప్పాడు విక్రమ్. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేది మాత్రం చెప్పలేనన్నాడు. ‘24’ తర్వాత విక్రమ్.. బన్నీతో సినిమా మొదలుపెడతాడు. మహేష్ ఎలాగూ ఖాళీ అవడానికి టైం పడుతుంది కాబట్టి బన్నీ సినిమా అయ్యాక సమంత సినిమానే మొదలుపెట్టే అవకాశముంది.