Begin typing your search above and press return to search.

అఖిల్ కథ.. ఎన్ని మలుపులో

By:  Tupaki Desk   |   9 July 2017 10:31 AM IST
అఖిల్ కథ.. ఎన్ని మలుపులో
X
ఒక ఆలోచన కథలా మొదలుపెట్టినప్పుడు ఒకలా ఉంటుంది అది ఒక సినిమాగా స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు వేరేలా మారుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే వేరే కథలా మారుతుంది. ఒక డైరెక్టర్ రాసిన కథ పరిస్థితి కూడ ఇలానే అయింది అంటా. కాకపోతే సినిమా ఇంకా తొలి దశలోనే ఉండడంచే కొన్ని మార్పులు చేసి తిరిగి తెరకెక్కిస్తున్నారట.

అఖిల్ హీరోగా వస్తున్న సినిమాను ‘మనం’, ‘24’ లాంటి సినిమాలుకు డైరక్షన్ చేసిన విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కథలో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు ఈ కథ ప్రయాణం ఇప్పటికే విడుదలైన ఒక తెలుగు సినిమాలాగా మారిందట. వెంటనే ఆ పొరపాటును తెలుసుకొని అఖిల్2 సినిమా టీమ్ చేయవలిసిన మార్పులన్నీ చేశారట. ఈ అనుకోని పరిణామాలకు విక్రం షాక్ అయ్యి వెంటనే షూటింగ్ కి కొంత విరామం చెప్పి మళ్ళీ కథలో స్క్రిప్ట్ లో మార్పులు చేశాడట. షూటింగ్ కూడా దీని మూలంగానే కొంత ఆలస్యంగా జరుగుతోందని అంటున్నారు.

అఖిల్ మొదటి సినిమా ఒక పీడకలలా మారిపోవడంతో నాగ్ అభిమానులు అంతా నిరాశ చెందారు. ఇప్పుడు ఈ సినిమా కోసం నాగార్జున చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు. సినిమా కూడ ఇంకా తొలి దశలోనే ఉండడంతో మరిన్ని జాగ్రతలు తీసుకొని ప్రొడక్షన్ జరిపిస్తున్నారట. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం బట్టి ఈ సినిమా పూర్తి అయ్యేప్పటికీ అనుకున్న సమయం కంటే ఎక్కువే పట్టవచ్చు. ఈ ఏడాది ఆఖరిలోనే సినిమా వచ్చే ఛాన్సుందట.