Begin typing your search above and press return to search.

విక్ర‌మ్‌ కి యాభ‌య్యేళ్లా... న‌మ్మ‌లేం!

By:  Tupaki Desk   |   17 April 2016 10:29 AM IST
విక్ర‌మ్‌ కి యాభ‌య్యేళ్లా... న‌మ్మ‌లేం!
X
తెర‌పై హుషారుని చూపించ‌డంలో కుర్ర హీరోల‌కి ఏమాత్రం తీసిపోడు. ఫైట్లు - డ్యాన్సులు - న‌ట‌న‌... ఏదైనా తీసుకోండి! ది బెస్ట్ అనిపించేంత వ‌ర‌కు నిద్ర‌పోడు. ఇక ప్ర‌యోగాల‌కైతే పెట్టింది పేరు. ద‌ర్శ‌కుడు చెప్పాలి కానీ ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డ‌తాడు. మామూలుగా ఇలాంటి తెగువ ఏ కుర్ర హీరోనో ప్ర‌ద‌ర్శిస్తాడంటే ఓకే. ఈ వ‌య‌సులో కాకుండా ఇంకెప్పుడు చేస్తార్లే అనుకోవ‌చ్చు. కానీ యాభ‌య్యేళ్ల హీరో ఇలా చేస్తాడంటే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవ‌ల్సిందే. అలా ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కులతో పాటు తోటి న‌టుల్ని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచే వ‌న్ అండ్ ఓన్లీ హీరో విక్ర‌మ్‌. అభిమానులు చియాన్ అని ముద్దుగా పిలుచుకొనే విక్ర‌మ్‌ ఈరోజు యాభ‌య్యో పుట్టిన‌రోజును జ‌రుపుకొంటున్నాడు.

వ‌య‌సు ప‌రంగా విక్ర‌మ్ హాఫ్ సెంచరీ కొట్టాడంటే అస‌లెవ‌రికీ న‌మ్మ‌శ‌క్యంగా లేదు. ఆయ‌న కుర్రాళ్ల‌తో పోటీప‌డే హీరో, ఆయ‌న‌కి యాభ‌య్యేళ్లేంటి అంటున్నారంతా. కానీ విక్ర‌మ్ మాత్రం త‌న తోటి హీరోల‌కి, భావి త‌రాల‌కి స్ఫూర్తి అని చెప్ప‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు. మొన్నొచ్చిన ఐ కోసం విక్ర‌మ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో మాటల్లో చెప్ప‌లేం. అస‌లు అన్న‌పానీయాలు మానేసి బ‌క్క ప‌ల‌చ‌గా త‌యార‌య్యాడు. ఆయ‌న రూపాన్ని చూసి అంద‌రూ వండ‌ర్ అయ్యారు. సినిమా కోసం అంత‌గా హార్డ్ వ‌ర్క్ చేసే హీరోలు నిజంగా అరుదు. విక్ర‌మ్ ఇలాగే క‌ష్ట‌ప‌డుతూ మ‌రెన్నో కొత్త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌ని.... మ‌రో హాఫ్ సెంచ‌రీ సినిమా రంగంలోనే సక్సెస్‌ ఫుల్‌ గా పూర్తి చేయాల‌ని ఆశిద్దాం. హ్యాపీ బ‌ర్త్ డే విక్ర‌మ్‌.