Begin typing your search above and press return to search.

ఖాన్ అకౌంట్ బ్యాన్ చేయమంటున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   29 Jun 2016 7:30 PM GMT
ఖాన్ అకౌంట్ బ్యాన్ చేయమంటున్న డైరెక్టర్
X
బంగారం సినిమాలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా గుర్తుందా? ఆ తర్వాత కూడా ఈమె కొన్ని తెలుగు సినిమాలు చేసినా.. నాగ్ తో నటించిన గ్రీకు వీరుడు ఒకటే చెప్పుకోదగ్గ సినిమా. అందులో కూడా పెద్ద రోల్ ఏం కాదు లెండి. అయితే ఇప్పుడీ భామ లేటెస్ట్ గా నటించిన సినిమా 1920 లండన్. దీని విడుదల సమయంలో.. క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఆమెపై తీవ్రమైన కామెంట్స్ చేశాడు.

మీరా చోప్రాని దర్శకుడు విక్రమ్ భట్ ఎవరైనా నిర్మాతల దగ్గర పంపాలన్నది కమల్ ఖాన్ సూచన. ఇదే కాదు.. మహిళలపై వల్గర్ కామెంట్లు చేయడంలో ఇతగాడు దిట్ట. 'పరిణీతి చోప్రాకు బాలీవుడ్ పెద్ద బ్యాక్ ఉందనుకుంటే నాకు ఓట్ చేయండి'... 'బాలీవుడ్ లో పెద్ద ఆంటీలా కనిపించే హీరోయిన్ ఎవరు'... 'సోనాక్షి సిన్హా తన స్తనాలకు పేరు పెట్టుకుంది'.. ఇలా ఉంటాయి కమల్ ట్వీట్లు.. ఓటింగ్ లు. అలాగే ప్రముఖులందరినీ టార్గెట్ చేస్తుంటాడు. ఎవరిపై రాళ్లేస్తే తన పేరు బాగా జనాల్లో నానుతుందో వాళ్లనే టార్గెట్ చేస్తుంటాడు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ టైమ్ లో పవన్ పై కూడా కామంట్స్ చేసిన విషయం ఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది.

ఇప్పుడీ కమల్ ఆర్ ఖాన్ అడ్డగోలు ట్వీట్లపై విక్రమ్ భట్ కి మండింది. తనను హీరోయిన్లను సప్లై చేసేవాడి కింద జమకట్టడంపై ఇప్పటికే కోర్టులో కేస్ పెట్టాడు. ఇప్పుడు కమల్ ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేయాలంటూ.. ఓ పిటిషన్ ప్రిపేర్ చేసి.. ప్రముఖులందరినీ సైన్ చేయాల్సిందిగా కోరుతున్నాడు. చాలామంది హీరోయిన్లు విక్రమ్ భట్ ను సమర్ధిస్తున్నారు. అయితే.. దీనికి కమల్ ఖాన్ ఏమీ బెదరలేదు. గతంలో విక్రమ్ భట్ ను తాను ఉపయోగించుకున్నపుడు సరైన ఆయిల్ వాడలేదని.. అందుకే ఇంకా నొప్పిగా ఉన్నట్లుంది అంటూ అటాక్ చేస్తూనే ఉన్నాడు.