Begin typing your search above and press return to search.

కొడుకుతో భారీ మల్టీస్టారర్ చేయనున్న స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   4 Jun 2020 8:10 AM GMT
కొడుకుతో భారీ మల్టీస్టారర్ చేయనున్న స్టార్ హీరో!
X
స్టార్ హీరో విక్రమ్.. గురించి తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం అక్కర్లేదు. నిన్నటి తరం హీరోలలో విక్రమ్ శైలి వేరు.. ఆయన ప్రతీ సినిమాలో వైవిధ్యం కనబరుస్తూ ఉంటారు. శివపుత్రుడు నుండి మొదలుకొని ‘అపరిచితుడు’ ‘విలన్’ ‘మల్లన్న’ ‘ఐ’.. ఇలా ఒక్కో సినిమాకి ఒక్కో వైవిధ్యాన్ని కనబరిచారు. తమిళ అభిమానులు విక్రమ్ ని 'చియాన్' అని పిలుచుకుంటారు.. అయితే ఈ హీరోకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. శివపుత్రుడు సినిమా దగ్గర నుండి ఆయన ప్రతీ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. అయితే, ఈ మధ్య కాస్త స్లో అయ్యారని చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘సామి 2’, మిస్టర్ కెకె సినిమాలు కూడా ఆశించస్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తనలోని వైవిధ్యమైన నటుడిని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి విక్రమ్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తన 58వ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కోబ్రా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇక అదే కాకుండా విక్రమ్ మణిరత్నంతో పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్.. గతేడాది 'ఆదిత్య వర్మ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ధృవ్. ఇక ధృవ్ రెండో సినిమా ఏంటా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తాడని ప్రస్తుతం నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆ మల్టీస్టారర్ సినిమా ఎవరితోనో కాదు. తన తండ్రి విక్రమ్ తోనే అని టాక్. విక్రమ్ ఇటీవలే తన 60వ సినిమాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ సినిమా ఓకే చేసాడట. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తన కొడుకు ధృవ్ కూడా నటిస్తాడని సమాచారం. మరి ఇదే గనక నిజమైతే తండ్రి కొడుకులను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. చూడాలి మరి అసలు విషయం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!