Begin typing your search above and press return to search.

ఈసారి విక్రమ్ కు ఊసరవెల్లి ఇన్ స్పిరేషన్..

By:  Tupaki Desk   |   21 May 2019 11:50 AM IST
ఈసారి విక్రమ్ కు ఊసరవెల్లి ఇన్ స్పిరేషన్..
X
తమిళ స్టార్ హీరో విక్రమ్ కు ఈమధ్య చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. 'ఇరుముగన్' లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ అవి కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేంత రేంజ్ సినిమాలు కాదు. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా విక్రమ్ మాత్రం వరసగా సినిమాలు చేసుకుంటూ చెలరేగి పోతున్నాడు. తాజాగా విక్రమ్ కొత్త సినిమాను లాంచ్ చేశారు.

'డిమాంటి కాలని'.. 'ఇమైక్క నోడిగల్' చిత్రాలను తెరకెక్కించిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాను #విక్రమ్58 అని పిలుచుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్స్.. వయకామ్ 18 స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాడానికి ప్లాన్ చేస్తున్నారని నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను తమిళంతో పాటుతెలుగు హిందీ భాషలలో కూడా రిలీజ్ చేస్తారట.

ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే దాదాపు ఆరు గెటప్స్ లో విక్రమ్ మొహం ఉంది. టైటిల్ లోగో లోనూ.. వెనక ఊసరవెల్లి చర్మం లాంటి డిజైన్ ఉంది. దానర్థం విక్రమ్ ఈ సినిమాలో కథ ప్రకారం పలురకాల గెటప్స్ లో కనిపిస్తాడని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే సమస్య. కొత్త కొత్త గెటప్పులు విక్రమ్ కు అలవాటైపోవడం కాకుండా.. ప్రేక్షకులకు కూడా రొటీన్ అనిపిస్తున్నాయి. అందుకే గెటప్స్ లో మాత్రమే కొత్తదనం కాకుండా కథ.. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటే మంచిది. లేకపోతే ఎన్ని గెటప్పులు వేసినా సక్సెస్ అనేది అందని ద్రాక్షే.