Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు స్మైల్ తో వచ్చాడు

By:  Tupaki Desk   |   26 May 2018 10:11 AM GMT
మెగా అల్లుడు స్మైల్ తో వచ్చాడు
X
మొదటి సారి మెగా ఫ్యామిలీ నుంచి వారికి బంధువైన వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్ట బోతున్నాడు. ఫస్ట్ లుక్ చూడగానే ఎవరో మీకు అర్దమైపోయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు శ్రీజ భర్త కానుగంటి కళ్యాణ్ దేవ్ హీరోగా అరగ్రేటం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . విజేత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మెగా అభిమానులను కళ్యాణ్ ఆకర్షించాడనే చెప్పాలి. ఇక నుంచి ఇలాంటి లుక్స్ చాలా వస్తాయని తెలుస్తోంది.

మొదటి లుక్ లో తండ్రి కొడుకుల రిలేషన్ గురించి ఈ పోస్టర్ చెప్పేసింది. కళ్యాణ్ నవ్వుతూ కనిపించగా.. అతనికి తండ్రిగా నటించనున్న మురళి శర్మ అటువైపుగా తిరిగి సీరియస్ గా నుంచున్నారు. విజేత టైటిల్ తోనే అందరిని ఫిదా చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ తో మరింత ఆకర్షించందనే చెప్పాలి. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ని కాన్సెప్ట్ అని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి పాజిటివ్ గా స్పందించారట. ఇక దర్శకుడు రాకేష్ శశి చెప్పిన తరువాత సినిమా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దర్శకుడు రాకేష్ శశి ఇంతకుముందు జతకలిసే సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. చాలా కాలం నుంచి చర్చలు జరిగిన తరువాత గాని ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. మొత్తానికి అనుకున్నటుగానే వారాహి ప్రొడక్షన్ ద్వారానే కళ్యాణ్ పరిచయం కాబోతున్నాడు. మరి ఎక్కువ బడ్జెట్ కాకుండా సింపుల్ గా సినిమాను ఫినిష్ చేయాలనీ మెగాస్టార్ నిర్మాతకు సలహా ఇచ్చినట్లు సమాచారం.