Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి 66.. ఫ‌స్ట్ లుక్ తో పైడిప‌ల్లి ఏంటో చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   20 Jun 2022 5:30 AM GMT
ద‌ళ‌ప‌తి 66.. ఫ‌స్ట్ లుక్ తో పైడిప‌ల్లి ఏంటో చూపిస్తాడా?
X
ద‌ళ‌ప‌తి విజయ్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ గా పాపులారిటీ ఉన్న విజ‌య్ తెలుగు- హిందీ మార్కెట్ల‌లో స‌త్తా చాటేందుకు హార్డ్ గా ట్రై చేస్తున్నాడు. ఇంత‌కుముందు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుస చిత్రాల్లో న‌టించి తమిళం-తెలుగు స‌హా ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో త‌న‌దైన మార్క్ వేసేందుకు ప్ర‌య‌త్నించాడు. మురుగ‌దాస్ 'తుపాకి' స్టార్ గా విజ‌య్ అంద‌రికీ క‌నెక్ట‌య్యి ఉన్నాడు.

ఇప్పుడు నేరుగా తెలుగు ద‌ర్శ‌కుడైన పైడిప‌ల్లితో భారీ సినిమా చేస్తూ తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. తెలుగు- తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొంద‌నున్న సినిమాతో ఇరుగు పొరుగునా త‌న‌దైన మార్క్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విజ‌య్ పుట్టినరోజు (22జూలై)కి ఒకరోజు ముందుగా అంటే జూలై 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి మేకర్స్ తేదీ స‌హా సమయాన్ని ప్రకటించారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి విజయ్ ని స్టైలిష్ అవతార్ లో ప్రెజెంట్ చేస్తున్నాడని తాజాగా విడుద‌ల చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్ చెబుతోంది. విజ‌య్ క్లాసీ అవ‌తార్ తో క‌నిపిస్తుండ‌డం కూడా ఆస‌క్తిని పెంచుతోంది. విజయ్ ని మునుపెన్న‌డూ చూడని స‌రికొత్త పాత్ర‌లో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసార‌ని మేకర్స్ అంటున్నారు. తెలుగు అగ్ర నిర్మాత‌లు దిల్ రాజు- శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.

కాస్టింగు కోసం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌

ద‌ళ‌ప‌తి 66 కాస్టింగ్ ఎంపికల విష‌యంలో పైడిప‌ల్లి బృందం చాలా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింద‌ని స‌మాచారం. ఇంత‌కుముందే ద‌ళ‌ప‌తి 66 లో న‌టిస్తున్న మ‌రో ఇద్ద‌రి పేర్లను టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో వెట‌ర‌న్ స్టార్స్ శ‌ర‌త్ కుమార్ .. ప్ర‌భు కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఆ ఇద్ద‌రి చేరిక‌తో ద‌ళ‌ప‌తి 66 త‌మిళ బెల్ట్ లో మ‌రింత బ‌లం పుంజుకున్న‌ట్టేన‌ని టాక్ వినిపించింది.

అలాగే బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల‌కు ప‌ని చేస్తూ ఈ సీజ‌న్ లో సౌతిండియా బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వెలిగిపోతున్న‌ ఎస్.ఎస్.థ‌మ‌న్ ద‌ళ‌ప‌తి 66 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు సంగీతం అందించిన థ‌మ‌న్ స‌ర్కార్ వారి పాట‌కు కూడా సంగీతం అందించారు. అత‌డి ఖాతాలో మ‌రో టాప్ మూవీగా విజ‌య్ సినిమా నిల‌వ‌నుంది. ద‌ళ‌ప‌తి 66 కి థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఫిక్స‌య్యాడు. శంక‌ర్ తో ఆర్.సి 15 లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్న థ‌మ‌న్ కి ఇది మ‌రో జాక్ పాట్.

శంక‌ర్ తో ఆర్.సి 15 షూటింగ్ ని పూర్తి చేస్తూనే.. దిల్ రాజు ద‌ళ‌ప‌తి 66ని ప‌ట్టాలెక్కిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. ఒకేసారి అగ్ర హీరోల‌తో వ‌రుస‌గా భారీ పాన్ ఇండియా చిత్రాల్ని నిర్మిస్తూ గ‌ట్స్ ఉన్న నిర్మాత‌గా నిరూపించుకుంటున్నారు. ఆర్.సి 15 కోసం నెవ్వ‌ర్ బిఫోర్ అనేంత పెద్ద బడ్జెట్ ని పెడుతున్న దిల్ రాజు విజ‌య్ పైనా 100 కోట్లు పైగానే బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయ‌నున్నారు. బీస్ట్ ఫెయిల్యూర్ త‌ర్వాత విజ‌య్ చిన్న‌పాటి గ్యాప్ తీసుకుని బ‌రిలో దిగుతున్నారు.