Begin typing your search above and press return to search.

విశాల్ జబ్బు గురించి రైటర్ విజయెంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 4:22 AM GMT
విశాల్ జబ్బు గురించి రైటర్ విజయెంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!
X
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ సరసన సునయన కథానాయికగా నటించింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ కి గెస్ట్ గా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వచ్చారు. ఈవెంట్ లో విశాల్ గురించి మాట్లాడుతూ అందరికి షాక్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. తన కొడుకు రాజమౌళికి ఉన్న జబ్బే విశాల్ కి ఉందని అన్నారు. అందరు విశాల్ గురించి మంచిగా చెబుతారు కానీ ఓ చెడు అలవాటు ఉందని అది తాను చెబుతానని అన్నారు.

ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ విశాల్ కి ఉన్న జబ్బు ఏంటని చెప్పారు అంటే.. సినిమా కోసం ఎంత బడ్జెట్ అయినా.. ఎన్నో రోజులైనా షూటింగ్ చేస్తారు. ఈ జబ్బు తన కొడుకు రాజమౌళికి ఉంది. అదే జబ్బు విశాల్ కి ఉందని అన్నారు.

రాజమౌళి అందుకున్నట్టే విశాల్ కూడా సక్సెస్ అందుకుంటాడని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పారని కాదు కానీ సినిమా కోసం విశాల్ చాలా రిస్క్ తీసుకుంటారు. ఈమధ్యనే రెండు సార్లు ఆయన షూటింగ్ లో గాయాలపాలయ్యారు. డూప్ తో చేసే యాక్షన్ సీన్స్ ని ఆయన సొంతం గా చేయాలని అనుకుంటారు.

సినిమా పర్ఫెక్షన్ కోసం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. 200 టికెట్ పెట్టి తమ సినిమా చూసే ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. అలాంటి వారిలో విశాల్ ఒకరు.

కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలనే కాకుండా తన సినిమాల్లో సొసైటీలో జరుగుతున్న విషయాల పట్ల ప్రస్థావిస్తాడు విశాల్. అందుకే అతని సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇక విశాల్ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ఉందని చెప్పొచ్చు.

మిగతా తమిళ హీరోల్లా విశాల్ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ కాంబో సెట్ అవ్వట్లేదు. కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా విశాల్ కి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా తన సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. విశాల్ లాఠితో మరోసారి తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నారు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ఆశించిన రేంజ్ లో ఉంటుందనిచెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.