Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్న స్టార్ రైటర్...!

By:  Tupaki Desk   |   23 April 2020 1:20 PM IST
సూపర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్న స్టార్ రైటర్...!
X
'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో అనే సస్పెన్స్‌ కు తెరపడింది. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' తర్వాత తాను దర్శకత్వం వహించనున్న చిత్రంలో మహేశ్‌ బాబు హీరోగా నటించబోతున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. సూపర్ స్టార్ మహేష్ - జక్కన్న దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్‌ మాత్రం కుదరలేదు. ఎప్పటి నుండో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. పదేళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. అప్పుడే వీరి కాంబోలో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినా మహేష్ - రాజమౌళి మిగతా ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉండడం వలన కుదరలేదు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తర్వాత ఈ మూవీ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు కోసం ఎలాంటి స్టోరీ రెడీ చేయలేదని రాజమౌళి స్వయంగా చెప్పాడు. ఈ లాక్ డౌన్ సమయాన్ని సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఉపయోగిస్తున్నారని సమాచారం. రాజమౌళి సినిమాలకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఆల్రెడీ కథా చర్చలు మొదలయ్యాయట. విజయేంద్ర ప్రసాద్ దగ్గర ఉన్న కొన్ని స్టోరీ లైన్స్ రాజమౌకి వినిపిస్తున్నారట. కొడుకు స్టోరీ లైన్ ఎంపిక చేస్తే దాన్ని డెవలప్ చేయాలని తండ్రి ఆలోచనట. గతంలో వీరి కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ తరహా మూవీ రానుందని వార్తలు కూడా వచ్చాయి. మరి వీరిద్దరూ కలిసి మహేష్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తారో చూడాలి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. మరోవైపు మహేశ్‌ బాబు తాజా చిత్రం ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వం లో తెరకెక్కనుందనే ప్రచారం జరగుతోంది. మహేశ్ - రాజమౌళి ప్రస్తుత కమిట్‌ మెంట్స్‌ ను పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్‌ లో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశముందని చెప్పవచ్చు.