Begin typing your search above and press return to search.

శివ నిర్వాణ‌కు వీడీ కండీష‌న్స్?

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 PM GMT
శివ నిర్వాణ‌కు వీడీ కండీష‌న్స్?
X
వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో చేస్తున్న 'లైగ‌ర్' షూటింగ్ పూర్త‌యిపోవ‌డంతో కొత్త చిత్రాల‌కు గ్రీన్ సిగ్ర‌ల్ ఇచ్చేస్తున్నారు రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌లే పూరి జ‌గన్నాథ్ తో 'జేజీఎమ్‌' ని ప్రారంభించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కాకుండానే రో చిత్రాన్ని మొద‌లుపెట్టేశారు. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు గ్రీన్‌ సిగ్ర‌ల్ ఇచ్చేశారు. స‌మంత హీరోయిన్ గా న‌టిస్తోంది. శుక్ర‌వారం ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.

దుబాయ్ లో ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ లో వున్న స‌మంత ఈ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేక‌పోయింది. దీంతో ఓపెనింగ్ ఫొటోల‌ని మార్ఫింగ్ చేసిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియాలో అవి షేర్ చేసి వైర‌ల్ అయ్యేలా చేశాడు.

అ ఫొటోలు చూసిన వారంతా ఇలా కూడా ప‌బ్లిసిటీ చేస్తారా? అంటూ కామెంట్ లు కురిపించారు. ఇదిలా వుంటే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కోసం శ‌నివారం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌శ్మీర్ వెళ్లిపోయారు. వెళ్ల‌డానికి ముందు హైద‌రాబాద్ ఏయిర్ పోర్ట్ లో హ‌ల్ చ‌ల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

సుప్రీమ్ అని రాసి వున్న బ్లాక్ టీష‌ర్ట్.. బ్లాక్ గాగుల్స్ ధ‌రించి ఫుల్ స్వాగ్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. క‌శ్మీర్ లో కీల‌క షెడ్యూల్ ని పూర్తి చేసి చిత్ర బృందం తిరిగి హైద‌రాబాద్ చేరుకుంటుంద‌ట‌. మే ఎండ్ వ‌ర‌కు అక్క‌డే టీమ్ కీల‌క షెడ్యూల్ కోసం వుండ‌నున్నార‌ని, ఆ త‌రువాత హైద‌రాబాద్ రానున్నార‌ని తెలిసింది. ఇక వైజాగ్ తో పాటు మ‌రో చోట జ‌రిపే షెడ్యూల్ తో సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది విజ‌య్ దేవ‌ర‌కొండ ప్లాన్.

ఈ విష‌యంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌కు కండీష‌న్స్ పెట్టారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. చాలా త‌క్కువ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి 'జేజీఎమ్‌' షూట్ కు వెళ్లాల‌న్న‌ది విజ‌య్ దేవ‌ర‌కొండ ఆలోచ‌న అని, అందులో భాగంగానే ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌కు కండీష‌న్స్ పెట్టార‌ని చెబుతున్నారు. అంతే కాకుండా మైత్రీ వారికి 'డియ‌ర్ కామ్రేడ్‌' టైమ్ లో క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ఇది. వేరే ద‌ర్శ‌కుడితో మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్ గా ఓ సినిమా ప్రారంభించారు.

రెగ్యుల‌ర్ షూట్ కి వెళ్ల‌కుండానే ఈ సినిమాని మ‌ధ్య‌లోనే ఆపేశారు. అదే ప్లేస్ లో ఇప్ప‌డు మైత్రీ వారికి ఈ సినిమాని చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ కార‌ణంగానే ఈ మూవీని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి పూరి సినిమాకు వెళ్లిపోనున్నాడ‌ట‌. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో బైక్ రేస‌ర్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌బోతున్నారు. గ‌తంలో దీనిపై ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నారు కూడా.