Begin typing your search above and press return to search.

అలా.. లేడీ అమితాబ్ రీ ఎంట్రీ..?

By:  Tupaki Desk   |   23 July 2015 4:29 PM GMT
అలా.. లేడీ అమితాబ్ రీ ఎంట్రీ..?
X
లేడీ అమితాబ్ గా పేరొంది.. మెగా హీరోలకు పోటీగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటూ ఆ క్రెడిట్ విజయశాంతికే దక్కుతుంది. హీరోలకు ఫ్యాన్స్ ఉండటం మామూలే. కానీ.. హీరోయిన్స్ కు ఫ్యాన్ మొయిల్ ఉంటారు కానీ.. హీరోలకు ఉన్నంతగా స్ట్రాంగ్ గా ఉండరు. కానీ.. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి అరుదైన ఘనత సాధించిన ఒకే ఒక్క వ్యక్తి విజయశాంతి.

అగ్రహీరోల స్థాయిలో విజయశాంతి ఫ్యాన్ మొయిల్ ఉండేవారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ.. రాజకీయాల్లో మునిగితేలుతూ.. మధ్య మధ్యలో వాటికి దూరంగా ఉంటున్న విజయశాంతికి తాజాగా.. కొత్త ఆలోచన చేస్తున్నారు. ముఖానికి రంగేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీరియస్ గా స్ర్కిప్ట్ లను చదువుతున్నారు.

సుదీర్ఘ విరామం తర్వాత సినిమా చేస్తుండటంతో కథ అదిరిపోయేలా ఉండాలని.. తన ఇమేజ్ ను మరింత పెంచటంతోపాటు.. తనను విపరీతంగా అభిమానించే అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఉండాలని విజయశాంతి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయశాంతి సినిమా మరో విధంగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ చిత్రం విడుదల సమయంలోనే విజయశాంతి చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని విజయశాంతి దృష్టికి తీసుకెళితే.. అలాంటిదేమీ లేదని.. కథ ఇంకా ఫైనల్ కాలేదని.. కథ ముఖ్యమే తప్పించి.. విడుదల మీద దృష్టి పెట్టటం లేదని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా మెగా హీరో.. లేడీ అమితాబ్ లు ఒకే సారి తమ తమ సినిమాలతో ముఖాముఖిన తలపడితే..?