Begin typing your search above and press return to search.

సరిలేరులో రాములమ్మ పాత్ర ఇదేనా ?

By:  Tupaki Desk   |   4 Jun 2019 10:15 AM IST
సరిలేరులో రాములమ్మ పాత్ర ఇదేనా ?
X
లేడీ అమితాబ్ గా ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా పారితోషికాలు తీసుకుని రికార్డు సృష్టించిన విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈవిడతో నటింపజేయాలని గతంలో ఎందరో దర్శకులు ప్రయత్నించినప్పటికీ ఫైనల్ గా అనిల్ రావిపూడి ఒక్కడే దాన్ని సాధించగలిగాడు. అయితే ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు లాంటి వివరాలు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.

దానికి సంబంధించిన లీక్ ఒకటి ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వాటి ప్రకారం విజయశాంతి ఇందులో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించబోతున్నారట. ఊరి బాగు కోసం తాపత్రయపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో కత్తి పట్టిన పాత్రలో చాలా ఎమోషనల్ డ్రామా రాసుకున్నాడట అనిల్. విజయశాంతికి ప్రత్యర్థిగా అంతకు మించిన మసాలాతో అరవింద సమేత వీర రాఘవను మించిన విలనీతో జగపతి బాబు భయపెట్టనున్నట్టు తెలిసింది. వీళ్ళ మధ్య ఆర్మీ ఆఫీసర్ మహేష్ బాబు వస్తాడన్న మాట.

కాకపోతే మొదలుపెట్టడం సీరియస్ గానే ఉన్నా తర్వాత తనదైన ఎంటర్ టైన్మెంట్ తో అనిల్ రావిపూడి డిఫరెంట్ గా స్క్రిప్ట్ రాసుకున్నాడట. దూకుడు తరహాలో ఇంకా చెప్పాలంటే దానికి రెట్టింపు స్థాయిలో అన్ని మసాలాలు సరిగ్గా కూర్చి మహేష్ చాలా కాలంగా మిస్ అవుతున్న రియల్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలనే తపనతో అనిల్ మాట ఇచ్చాడట. మహేష్ ని ఈ స్క్రిప్ట్ అంతగా ఎగ్జైట్ చేయడానికి కారణం కూడా అదే అంటున్నారు. ఇదంతా అధికారిక ప్రకటనలు కాదు కాని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళక ముందే ఆసక్తి రేపుతున్నాయి