Begin typing your search above and press return to search.

సుమ‌కు విజ‌య‌మ్మ కాంప్లిమెంట్‌!

By:  Tupaki Desk   |   1 Feb 2019 6:28 PM GMT
సుమ‌కు విజ‌య‌మ్మ కాంప్లిమెంట్‌!
X
వైయ‌స్సార్ పాద‌యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన `యాత్ర` ఫిబ్ర‌వ‌రి 8న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. నేటి ప్రీరిలీజ్ వేడుక‌లో వైయ‌స్సార్ స‌తీమ‌ణి వైయ‌స్ విజ‌య‌మ్మ పాత్ర‌ధారి ఆశ్రిత స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఒక మ‌హానాయ‌కుడి స‌తీమ‌ణి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంది. ఆ అవ‌కాశ‌మిచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌హి, విజ‌య్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు అని తెలిపారు.

ఈ వేదిక‌పై యాంక‌ర్ సుమ- ఆశ్రిత మ‌ధ్య ఛ‌మ‌క్కులు స‌భికుల్ని ఆద్యంతం అల‌రించాయి. ``సుమ గారు మీలాంటి స్పాంటేనియ‌స్ యాంక‌ర్ లేర‌మ్మా.. `` అంటూ ఆశ్రిత పొగిడేశారు. ``నన్ను పొగిడితే బిస్కెట్ వేసిన‌ట్టు అంటారా? నావి పాము చెవులు.. వినేశాను`` అంటూ సుమ అభిమానుల స్పంద‌న‌పై వ్యాఖ్యానించి న‌వ్వులు పూయించింది సుమ‌.

ఇక ఈ వేదిక‌పై యాంక‌ర్ సుమ‌ ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్ కి బిస్కెట్ వేసేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది .. సినిమా రిలీజ్ ముందే హిట్టు కొట్టేశావ్ .. శుభాకాంక్ష‌లు అంటూ ద‌ర్శ‌కుడు మ‌హి.విని పొగిడేసింది సుమ‌. ఇప్ప‌టికి మూడు సినిమాల‌కే ఈవెంట్ అయిన‌ త‌ర్వాత హిట్టు కొడ‌తార‌ని చెప్పాను. చాలా కాలానికి మీ సినిమాకే ఆ ఛాన్స్ ద‌క్కింది. రిలీజ్ ముందే మీరు హిట్టు కొడుతున్నార‌ని నాకు ఈ ట్రైల‌ర్, టీజ‌ర్ అన్నీ చూశాకే అర్థ‌మైంది అంటూ పొగిడేసింది సుమ‌. ఇక సుమ చెప్పింది కాబ‌ట్టి హిట్టు కొట్టిన‌ట్టే అంటూ అభిమానులు ఆన్ లైన్ లో ప‌రాచికం ఆడారు.