Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: సీనియర్ హీరోకు కరోనా?
By: Tupaki Desk | 24 Sept 2020 2:40 PM ISTసీనియర్ తమిళ హీరో, రాజకీయ నాయకుడు ‘కెప్టెన్’గా అందరూ పిలుచుకునే విజయకాంత్ తాజాగా కరోనా బారినపడ్డారు.దీంతో ఆయనను చెన్నై మియాడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. 68 ఏళ్ల విజయకాంత్ కు కోవిడ్ -19 లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా నిర్ధారణ అయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
తమిళంలో నటుడిగా విజయకాంత్ ఒకప్పుడు చాలా ఫేమస్. ప్రజలలో స్టార్ స్టేటస్ సంపాదించాడు. విజయకాంత్ 2005లో తమిళనాట రాజకీయ అరంగేట్రం చేశాడు. డిఎండికె పార్టీని స్థాపించాడు. తద్వారా నటనకు బ్రేక్ ఇచ్చి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2016 ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులో 2006 మరియు 2011 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయకాంత్ ఎన్నికయ్యారు.
ఇదివరకే తీవ్రమైన అనారోగ్యంతో విజయకాంత్ చాలా రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇప్పుడు కరోనా బారినపడడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆాకాంక్షిస్తున్నారు.