Begin typing your search above and press return to search.

చిరు మూవీ కోసం ఆఫర్‌ వచ్చింది: విజయశాంతి

By:  Tupaki Desk   |   19 Dec 2020 4:30 PM IST
చిరు మూవీ కోసం ఆఫర్‌ వచ్చింది: విజయశాంతి
X
టాలీవుడ్‌ 1980, 90 ప్రేక్షకులకు చిరంజీవి విజయశాంతిల జోడీ అంటే అమితమైన అభిమానం ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రికార్డు స్థాయి విజయాలను అందుకున్న జంటగా కూడా వీరిద్దరు నిలిచారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మద్య విభేదాలు వచ్చాయని అన్నారు. దాంతో వీరు కలిసి నటించలేదు. 2006 సంవత్సరంలో విజయశాంతి నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో విజయశాంతి మరిన్ని సినిమాలు చేయాలని మేకర్స్‌ కోరారు. చిరంజీవి మూవీలో ఈమెకు ఆఫర్‌ వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి ఆ విషయమై స్పందించింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా మంది నన్ను సినిమా ఆఫర్లతో సంప్రదించారు. కాని నేను ఆసక్తి చూపించలేదు. చిరంజీవి సినిమాలో నటించాల్సిందిగా కూడా కొందరు సంప్రదించారు. ఆయన సినిమాలో కీలక పాత్ర ఉందంటూ నన్ను అడిగారు కాని నేను రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా ఆయనతో నటించలేను అని చెప్పాను. సినిమాల్లో మళ్లీ నటించక పోవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చింది. అభిమానులు మిమ్ములను వెండి తెరపై ఇంకా చూడాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో నేను రాజకీయాలతో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. సినిమాల వల్ల దానికి ఇబ్బంది ఎదురవుతుందని రాములమ్మ విజయశాంతి అంది.