Begin typing your search above and press return to search.

చిరుతో నటించే ఆసక్తి లేదన్న రాములమ్మ!

By:  Tupaki Desk   |   18 Dec 2020 9:31 AM IST
చిరుతో నటించే ఆసక్తి లేదన్న రాములమ్మ!
X
లేడీ సూపర్‌ స్టార్‌ గా.. లేడీ అమితాబ్‌ గా పేరు దక్కించుకున్న విజయశాంతి సినిమాలకు దూరం అయ్యి పూర్తి రాజకీయాల్లో మునిగి పోయారు. ఆమె మళ్లీ సినిమాలు చేయరేమో అనుకుంటూ ఉండగా అనూహ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ సమయంలో చిరంజీవితో ఉన్న విభేదాలు అన్ని పక్కకు పెట్టి మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ తేల్చి చెప్పింది. ఇండస్ట్రీలో నాకు మంచి మిత్రుడు చిరంజీవి అంటూ చాలా మాట్లాడారు. ఆ రోజు చిరంజీవి మరియు విజయశాంతిలను అలా చూసి 1980 సినిమాల ప్రేమికులు ఆనందించారు. వీరిద్దరు మళ్లీ కలిసి నటిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నారు. విజయశాంతి ఆ సమయంలో మంచి పాత్రలు వస్తే నటిగా కంటిన్యూ అవుతాను అన్నారు.

కట్‌ చేస్తే విజయశాంతి కాంగ్రెస్‌ నుండి బీజేపీలోకి వెళ్లారు. ఆ సందర్బంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమాలపై క్లారిటీ ఇచ్చింది. సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని భావించినప్పటికి రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదంది. చిరంజీవి గారితో నటించే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించిన సమయంలో చిరుతో నటించే ఆసక్తి లేదని రాములమ్మ విజయశాంతి పేర్కొన్నారు. చిరంజీవితోనే కాకుండా ఏ స్టార్‌ హీరో సినిమాలో కూడా ప్రస్తుతానికి నటించాలని లేదని పేర్కొంది. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామంటూ ఆమె పేర్కొన్నారు. సినిమాల గురించి ఆలోచించే సమయం లేదని కూడా ఆమె అన్నారు.