Begin typing your search above and press return to search.

స‌తికి విగ్ర‌హం క‌ట్టించిన గ్రేట్ సూప‌ర్ స్టార్

By:  Tupaki Desk   |   20 Feb 2020 8:15 AM GMT
స‌తికి విగ్ర‌హం క‌ట్టించిన గ్రేట్ సూప‌ర్ స్టార్
X
ప్రేయ‌సి కోరింద‌ని తాజ్ మ‌హ‌ల్ నే క‌ట్టాడు షాజ‌హాన్. అదో గొప్ప చ‌రిత్ర‌. భాగ‌మ‌తి కోసం భాగ్య‌న‌గ‌రాన్నే నిర్మించాడు కులీకుతుబ్ షా. ఇదో అరుదైన చ‌రిత్ర‌. వీట‌న్నిటికీ ఏమాత్రం త‌గ్గ‌ని మ‌రో చ‌రిత్ర‌కు కార‌కుడ‌య్యారు సూప‌ర్ స్టార్ కృష్ణ. నిజ‌మైన‌ ప్రేమ‌లు క‌నుమ‌రుగైన మోడ్ర‌న్ వ‌ర‌ల్డ్ లో తాను వేరు అని ప్రూవ్ చేశారు. నేడు త‌న స‌తీమ‌ణి కీ.శే.విజ‌య‌నిర్మల జ‌యంతి సంద‌ర్భంగా త‌న‌కు అరుదైన కానుక‌ను ఇచ్చి చ‌రిత్ర‌కెక్కారు.

ఇంత‌కీ ఆయ‌నేం కానుక ఇచ్చారు? అంటే.. ఏకంగా స‌తీమ‌ణి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఎంతో అపురూపంగా త‌న‌ ప్రేమ‌కు గుర్తుగా ఒక అద్భుత‌మైన డిజైన్ తో విజ‌య‌నిర్మ‌ల విగ్ర‌హాన్ని రెడీ చేయించి ఆవిష్క‌రించారు. ఆస‌క్తిక‌రంగా ఈ విగ్ర‌హాన్ని విజ‌య‌నిర్మ‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన నాన‌క్ రామ్ గూడ తోట‌లోనే సూప‌ర్ స్టార్ ఆవిష్క‌రించారు. నటి.. మహిళా దర్శకురాలు.. గిన్నిస్ రికార్డ్ విజేత‌ విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనిర్మల విగ్రహాన్ని హీరో కృష్ణ స్వ‌యంగా ఆవిష్కరించారు. కృష్ణంరాజు- మురళీమోహన్- మహేష్ - నమ్రత- ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి- గల్లా జయదేవ్- నిర్మాత పివిపి- పరుచూరి గోపాల కృష్ణ- ఆదిశేషగిరరావు- మారుతి- నందిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలోనే `విజయ నిర్మల స్త్రీ శక్తి` పురస్కారాన్ని లేడీ డైరెక్టర్ నందినిరెడ్డికి కృష్ణంరాజు- మహేష్ సంయుక్తంగా అందచేశారు. అమ్మ‌ పేర అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా వుంద‌ని నందిని రెడ్డి ఈ సంద‌ర్భంగా అన్నారు. మునుముందు ఇలా మ‌హిళా ద‌ర్శ‌కుల‌కు పుర‌స్కారాలు అందిస్తామ‌ని విజ‌య‌నిర్మ‌ల వార‌సుడు సీనియ‌ర్ న‌రేష్ ఈ వేదిక‌ పై ప్ర‌క‌టించారు.