Begin typing your search above and press return to search.

న‌టుడికి బ‌హుమానంగా చెంప‌దెబ్బ‌

By:  Tupaki Desk   |   22 Nov 2016 4:31 AM GMT
న‌టుడికి బ‌హుమానంగా చెంప‌దెబ్బ‌
X
ఎవ‌రైనా బ‌హుమ‌తుల్ని వ‌స్తువుల రూపంలోనో... డ‌బ్బు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటారు. కానీ ఒక‌రికి మాత్రం చెంప‌దెబ్బ బ‌హుమానంగా ల‌భించింది. ఆశ్చ‌ర్య‌పోతున్నారా? కానీ ఇది నిజం. అయితే ఆ చెంప‌దెబ్బ‌ని ప‌ర‌మానందంగా స్వీక‌రించాడాయ‌న‌. దానికితోడు ఆ విష‌యాన్ని గొప్ప‌గా.. ఆనందంగా చెప్పుకొన్నాడు. ఇంత‌కీ ఆ బ‌హుమ‌తి ఇచ్చిందెవ‌రో తెలుసా? సీనియ‌ర్ న‌టి విజ‌యనిర్మల‌. స్వీక‌రించింది... ఆమె త‌న‌య‌డు న‌రేష్‌. ఆ బ‌హుమ‌తికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే... సీనియ‌ర్ న‌టుల్లో ఒక‌రైన న‌రేష్ ఇటీవ‌ల క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా జోరు పెంచారు. ప‌లు చిత్రాల్లో కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అల‌రిస్తున్నాడు.

ఇటీవ‌ల ఆయ‌న ఘ‌ట‌న సినిమాతో విల‌న్‌ గా కూడా మారాడు. తెర‌పై సైకిక్ విల‌న్‌ గా క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రెండు రేప్ స‌న్నివేశాల్లో న‌టించాడాయ‌న‌. ఆ సినిమాని న‌రేష్ త‌ల్లి విజ‌య నిర్మల కూడా చూశార‌ట‌. సినిమా చూసిన వెంట‌నే న‌రేష్ ద‌గ్గ‌రికి వెళ్లి చెంప ఛెళ్లుమ‌నిపించార‌ట‌. ఇది నువ్వు చేసిన విల‌న్ పాత్రకి బ‌హుమానం అని చెప్పార‌ట‌. ఆ త‌ర్వాత కొడుకుగా ఆయ‌న్ని ఆశీర్వ‌దించార‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు న‌రేష్‌. త‌న త‌ల్లే వ‌చ్చి చెంప దెబ్బ కొట్టిందంటే... నరేష్ విల‌న్ పాత్ర‌లో ఎంత‌గా ఒదిగిపోయాడో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఆ విష‌యాన్ని గొప్ప‌గా చెప్పుకుంటున్నాడు న‌రేష్‌. నాకు ద‌క్కిన గొప్ప‌బ‌హుమానం అదే అంటున్నాడాయన‌. ఇక‌పై సీరియ‌స్ విల‌న్ పాత్ర‌ల‌కి తాను రెడీ అని, యాక్ష‌న్‌ కి ప్రాధాన్య‌మున్న విల‌న్‌గా క‌నిపించ‌డానికి కూడా రెడీనే అని సెల‌విస్తున్నాడాయ‌న‌. ఆ మేర‌కు జిమ్‌లోకి వెళ్లి క‌స‌ర‌త్తులు కూడా మొద‌లుపెట్టాడు. దీన్నిబ‌ట్టి స్టైలిష్ విల‌న్ పాత్ర‌ల్లోనైనా నేను ఒదిగిపోతాన‌నే ఓ సంకేతాన్ని న‌రేష్ ఇస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/