Begin typing your search above and press return to search.

ఆసుప‌త్రికి వెళ్లి సాయం చేసి మ‌రీ వేధించాడ‌ట‌!

By:  Tupaki Desk   |   11 March 2019 4:53 AM GMT
ఆసుప‌త్రికి వెళ్లి సాయం చేసి మ‌రీ వేధించాడ‌ట‌!
X
మీటూ నేప‌థ్యంలో త‌మకు ఎదురైన భ‌యంక‌ర అనుభ‌వ‌నాల్ని.. ఇబ్బందులపై ప‌లువురు న‌టీమ‌ణులు గొంతెత్తి సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌తి రంగంలోని మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు మామూలే అయినా.. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టీమ‌ణులు.. ఇత‌ర విభాగాల‌కు చెందిన మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన వేధింపుల‌పై గ‌ళం విప్పారు.

ఇదిలా ఉంటే.. అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న ఒక మ‌హిళా న‌టిని ఒక న‌టుడు లైంగికంగా వేధించిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించి పోలీసుల‌కు ఒక న‌టి కంప్లైంట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆసుప‌త్రిలో ఉన్న న‌టికి సాయం చేసిన నాటి నుంచి ఆమెను ఆ న‌టుడు వేధింపుల‌కు గురి చేయ‌టం గ‌మ‌నార్హం.

న‌టి విజ‌య‌ల‌క్ష్మీ అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె ఆసుప‌త్రిలో ఉన్న వేళ త‌న‌కు సాయం చేయాల‌ని మీడియాలో కోరారు. దీనికి స్పందించిన‌ న‌టుడు ర‌విప్ర‌కాష్ ఆసుప‌త్రికి వెళ్లి ఆమెకు రూ.ల‌క్ష సాయం చేశారు. అయితే.. సాయం చేసిన నాటి నుంచి త‌న‌ను వేధించ‌టం షురూ చేసిన‌ట్లుగా ఆమె చెబుతున్నారు.

ఐసీయూకి రోజూ రావ‌టం.. ఫోన్లో అస‌భ్యంగా సందేశాలు పంపేవార‌ని.. త‌న‌ను మాన‌సికంగా శారీర‌కంగా వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో ఆమె పెట్టిన సందేశం ఇప్పుడు వైర‌ల్ గా మారి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఆరోప‌ణ‌ల్నిన‌టుడు ర‌విప్ర‌కాశ్ ఖండించారు.