Begin typing your search above and press return to search.

విజయ్ 'బీస్ట్' సినిమాకు గుమ్మడికాయ

By:  Tupaki Desk   |   12 Dec 2021 9:30 AM GMT
విజయ్ బీస్ట్ సినిమాకు గుమ్మడికాయ
X
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఇళయ దళపతి విజయ్ కు తన కంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో బీస్ట్ సినిమా ఒకటి. తాజాగా బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. విజయ్ తన సినిమాలతో కోలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా వస్తావా సంఘటనలకు దగ్గరగా ఉంటుంది.

అందుకే విజయ్ సినిమాలు ప్రజలకు బాగా చేరువ అవుతాయి. విజయ్ గత చిత్రం మాస్టర్ ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా దాదాపు 200 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ ను తిరగరాసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అంతే హుషారుగా విజయ్ తన తర్వాత సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసాడు.

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి చేసుకున్నట్టు బీస్ట్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం రోజు పూజా తన పార్ట్ షూటింగ్ ను ముగించుకుని బీస్ట్ షూటింగ్ కు గుడ్ బై చెప్పింది.

పూజా బీస్ట్ సినిమాపై తన ఫీలింగ్స్ ను ఒక వీడియో ద్వారా చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ఒక వెకేషన్ లాగా ఉంది.. అందరు ఎంతో ఎంజాయ్ చేసాం..అసలు షూటింగ్ చేసినట్టే లేదు.. అని తన ఫీలింగ్స్ ను తెలిపింది. ఇక తాజాగా విజయ్ కూడా బీస్ట్ సినిమా షూటింగ్ గు గుడ్ బై చెప్పాడు. విజయ్ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు ఒక హగ్ ఇచ్చి తన హర్షాన్ని వ్యక్తం చేసాడు.

అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన పాటతో ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ చెన్నై లోని గోకులమ్ స్టూడియోస్ లో జరిగింది. నిన్న శనివారం తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.