Begin typing your search above and press return to search.
సేతుపతి కండిషన్స్.. కిందామీదా పడుతున్న పుష్ప టీమ్
By: Tupaki Desk | 25 April 2020 2:20 PM ISTఅనౌన్స్మెంట్ రోజునుంచే ఒక సినిమాపై ఆసక్తి కలగడం సాధారణమైన విషయం కాదు. 'పుష్ప' సరిగ్గా అలాంటి కేటగిరీ కి సంబంధించిన సినిమానే. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న నెక్స్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'అల వైకుంఠపురములో' ఘన విజయంతో సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో మొదట విలన్ పాత్రకు తమిళ హీరో విజయ్ సేతుపతి ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకున్నాడని.. మేక ర్లు వేరే నటుడి కోసం చూస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
విజయ్ సేతుపతి తప్పుకోవడానికి కారణం.. కాల్షీట్లు కుదరక పోవమేనని.. తమిళంలో చాలా ప్రాజెక్టులు చేస్తుండడంతో.. ఈ లాక్ డౌన్ కారణంగా సేతుపతి కాల్ షీట్స్ టైట్ అయ్యాయని అన్నారు. నిజానికి అది కారణం కాదట. 'పుష్ప' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో అనౌన్స్ చేయడంతో సేతుపతి తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తనకు పది కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని అని అడిగాడట. అంతే కాకుండా తెలుగుతో పాటు మిగతా అన్ని వెర్షన్లకు విలన్ గా నటిస్తానని కానీ తమిళం లో మాత్రం వేరే నటుడితో విలన్ పాత్ర చేయించుకోవాలని కండిషన్ పెడుతున్నాడట. నిజానికి ఈ రెండో కండిషన్ 'ఉప్పెన' టీంకు కూడా విజయ్ సేతుపతి పెట్టాడట. 'ఉప్పెన' టీం అందుకు ఒప్పుకోవడం తోనే విలన్ పాత్రలో నటించాడట.
అయితే సుకుమార్ మాత్రం తమిళ వెర్షన్ కు మరో నటుడిని తీసుకోవడం కష్టమని.. దానివల్ల షూటింగ్ డేస్ పెరుగుతాయని ఆలోచిస్తున్నారట. మరో వైపు అల్లు అర్జున్ ఎలాగైనా విజయ్ సేతుపతిని ఈ సినిమాలో ఫైనల్ చేయాలని అంటున్నారట. దీంతో నిర్మాతలు సేతుపతి ఒప్పించే దిశగా మంతనాలు జరుపుతున్నారని సమాచారం. రెమ్యూనరేషన్ అటుఇటుగా ఒప్పుకునే అవకాశం ఉంది కానీ తమిళ వెర్షన్ కు విలన్ గా నటిస్తే అక్కడ తన హీరో మార్కెట్ కు దెబ్బ అని సేతుపతి అంటున్నాడట. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.