Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురికి ఆల్ట‌ర్నేట్ అవుతాడా?

By:  Tupaki Desk   |   7 Oct 2019 7:35 AM GMT
ఆ న‌లుగురికి ఆల్ట‌ర్నేట్ అవుతాడా?
X
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ హీరోలు అయినా తెలుగులోనూ రాణించారు. అస‌లు భాష‌తో ప‌ని లేకుండా.. ద‌క్షిణాది ఉత్త‌రాది అనే విబేధం లేకుండా అన్నిచోట్లా వీరాభిమానుల్ని సంపాదించుకున్నారు ఆ ఇద్ద‌రూ. ర‌జ‌నీ-క‌మ‌ల్ న‌టించిన సినిమాలు వ‌స్తున్నాయి అంటే జాతీయ స్థాయిలో అంతా ఆస‌క్తిగా వేచి చూస్తారు. అయితే ఆ స్థాయిని ఆ త‌ర్వాత విక్ర‌మ్-అజిత్-సూర్య-ధ‌నుష్‌ వంటి కోలీవుడ్ స్టార్లు అందిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు కానీ.. ఎందుక‌నో ఆ రేంజును అందుకోలేక‌పోయారు. ర‌జ‌నీ-క‌మ‌ల్ త‌ర్వాత‌ సూర్య‌- కార్తీ బ్ర‌ద‌ర్స్ త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు ధీటుగా టాలీవుడ్ లోనూ ఓ వెలుగు వెలిగి ఎందుక‌నో ఇటీవ‌ల త‌డ‌బ‌డుతున్నారు. టాలీవుడ్ లో ఆ ఇద్ద‌రికీ పెద్ద కెరీర్ ఉంద‌ని అనుకుంటే సీన్ రివ‌ర్స‌య్యింది.

స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో ఇక్క‌డా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్. తుపాకి-అదిరింది (మెర్స‌ల్) చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. థియేట‌ర్ల‌లో చూడ‌ని వారు కూడా టీవీల్లో చూసి విజ‌య్ ప్ర‌తిభ గురించి తెలుసుకున్నారు తెలుగు జ‌నం. కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ అని అత‌డిని ఎందుకు పిలిపించుకుంటున్నాడో అర్థ‌మైంది. అందుకే ఇల‌య‌ద‌ళ‌పతి విజ‌య్ న‌టించిన సినిమా వ‌స్తోంది అంటే టాలీవుడ్ మార్కెట్ వ‌ర్గాల్లోనూ అంతో ఇంతో చ‌ర్చ సాగుతోంది. మునుప‌టితో పోలిస్తే ఆ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

తాజాగా విజ‌య్ న‌టించిన బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో విడుద‌ల‌వుతోంది. 27 అక్టోబ‌ర్ రిలీజ్ తేదీ. ఈ సినిమాకి ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇందులో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. మైకేల్ .. బిగిల్ రెండు పాత్ర‌ల‌తో అభిమానుల‌కు ట్రీటివ్వ‌బోతున్నాడు. ఒక‌రు ఫుట్ బాల్ కోచ్ అయితే ఇంకో పాత్ర‌లో క‌త్తి ప‌ట్టుకుని ర‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు. విజిల్ సౌండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌వ‌ర‌కూ వినిపిస్తుంది? జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. తాజాగా రివీలైన‌ విజిల్ టైటిల్ పోస్ట‌ర్ లో విజ‌య్ డ‌బుల్ రోల్ లుక్ మాత్రం ఆకట్టుకుంది. మెర్స‌ల్ ఫేం అట్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌జ‌నీ.. క‌మ‌ల్ .. సూర్య‌.. కార్తీ .. వీళ్లంద‌రినీ అధిగ‌మించేలా విజ‌య్ టాలీవుడ్ లో స‌క్సెస్ ద‌క్కించుకుంటాడా అన్న‌ది వేచి చూడాలి.