Begin typing your search above and press return to search.

విజ‌య్‌ జోరు ముందు అజిత్ నిల‌బ‌డ‌ట్లేదా?

By:  Tupaki Desk   |   30 Dec 2022 2:52 PM GMT
విజ‌య్‌ జోరు ముందు అజిత్ నిల‌బ‌డ‌ట్లేదా?
X
త‌మిళ‌నాట విజ‌య్ నెంబ‌ర్ వ‌న్. అక్క‌డ అత‌న్ని మించిన స్టార్ లేడు. అందుకే విజ‌య్ `వారీసు`కు క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్య‌ధికంగా థియేట‌ర్లు కేటాయించాల్సిందేనంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డ నిజ‌మ‌వుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. విజ‌య్ న‌టిస్తున్న `వారీసు`, అజిత్ న‌టిస్తున్న `తునీవు` ఈ సంక్రాంతికి పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 12న ఈ ఇద్ద‌రు క్రేజీ స్టార్ల సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య స‌ర‌వ‌త్త‌ర‌మైన పోటీ నెల‌కొంది.

అది థియేట‌ర్ల విష‌యంలోనూ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ లో విజ‌య్ బిగ్ స్టార్ అని, త‌న సినిమాకే అధికంగా థియేట‌ర్లు కేటాయించాల‌ని దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాట పెద్ద దుమార‌మే రేగింది. త‌న వ్యాఖ్య‌ల‌ని త‌ప్పుబ‌ట్టిన అజిత్‌ అభిమానులు దిల్ రాజుపై సంచ‌ల‌న కామెంట్ లు చేస్తూ నెట్టింట గ‌త కొన్ని రోజులుగా వైర‌ల్ చేస్తున్నారు. విజ‌య్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేస్తే మా హీరో సినిమాలు ఇండ‌స్ట్రీ హిట్ లు గా నిలిచి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు మొద‌లైంది. ఈ పోరులో మా హీరో పైచేయి సాధిస్తాడ‌ని విజ‌య్‌ ఫ్యాన్స్.. అంత లేదు మా హీరోనే పై చేయి సాధిస్తాడ‌ని అజిత్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు విరుసుకుంటున్నారు.

త‌మిళ‌నాట ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే విదేశాల్లో మాత్రం అజిత్ సినిమా వెన‌క‌బ‌డిపోతోంది. అక్క‌డ `తునీవు`ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య్ సినిమా ఆధిప‌త్యాన్ని చెలాయిస్తూ రికార్డు స్థాయి థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది.

యుఎస్ లో `వారీసు`కు భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని కేటాయిస్తే అజిత్ `తునీవు`కి వంద థియేట‌ర్లు కూడా ద‌క్క‌క‌పోవ‌డం అభిమానుల‌ని షాక్ కు గురిచేస్తూ దిల్ రాజు మాట‌ల్ని నిజం చేస్తోంది. ఐరోపాలో కూడా `తునీవు` ప‌రిస్థితి మ‌రీ దారుణంగా వుంది. ఇక ఫ్రాన్స్ లోనూ విజ‌య్ `వారీసు`దే హ‌వా క‌నిపిస్తోంది. విజ‌య్‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న అజిత్ సినిమాకు ఓవ‌ర్సీస్ లో ఇలాంటి ప‌రిస్థితి ఏంట‌ని ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.