Begin typing your search above and press return to search.

ఆ హీరో ఫ్యాన్స్‌ ను మచ్చిక చేసుకుంటున్న సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   17 March 2020 2:30 AM GMT
ఆ హీరో ఫ్యాన్స్‌ ను మచ్చిక చేసుకుంటున్న సూపర్‌ స్టార్‌
X
టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా ఫ్యాన్స్‌ మధ్య విభేదాలు ఉంటాయి. సోషల్‌ మీడియాలోనే కాకుండా బహిరంగంగా కూడా ఫ్యాన్స్‌ గొడవ పడ్డ సందర్బాలు చాలా ఉన్నాయి. ఇక టాలీవుడ్‌ లో అభిమాను మద్య గొడవల కంటే కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోల అభిమానుల మద్య గొడవలు రెండు మూడు రెట్లు అధికంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ హీరోల ఫ్యాన్స్‌ అక్కడ చంపుకునే వరకు వెళ్లారు.

ముఖ్యంగా విజయ్‌.. అజిత్‌.. రజినీకాంత్‌ ల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఇంకా బహిరంగ ప్రదేశాల్లో ఎన్నో సార్లు ఢీ అంటే ఢీ అన్న సందర్బాలు చాలానే ఉన్నాయి. హీరోలు కూడా ఫ్యాన్స్‌ మద్య గొడవలు చల్లార్చేందుకు ప్రయత్నించింది లేదు. మొదటి సారి సూపర్‌ స్టార్‌ విజయ్‌ తన తోటి హీరో అజిత్‌ గురించి పాజిటివ్‌ గా మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. అజిత్‌ గురించి విజయ్‌ పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవ్వడంపై నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

ఆమద్య విజయ్‌ పై ఐటీ రైడ్స్‌ జరుగుతున్న సమయంలో అజిత్‌ రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయాలి మాలాంటి వాళ్ల వద్ద ఏముంటాయి అంటూ పరోక్షంగా విజయ్‌ కి మద్దతు తెలిపాడు. అందుకే ఇప్పుడు విజయ్‌ ‘మాస్టర్‌’ ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ నాకు ఆప్త మిత్రుడు అయిన అజిత్‌ కు ఇష్టమైన సూట్‌ ను వేసుకున్నాను. నేను సూట్‌ వేసుకోవడం అజిత్‌ కు ఇష్టమని గతంలో అన్నాడు. అందుకే ఈసారి ఇలా అన్నాడు.

ఉన్నట్లుండి విజయ్‌ చాలా పాజిటివ్‌ గా అజిత్‌ గురించి మాట్లాడటంపై తమిళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. విశ్లేషకులు మరియు కొందరు నెటిజన్స్‌ మాత్రం అజిత్‌ ఫ్యాన్స్‌ ను తనవైపుకు తిప్పుకునేందుకు ఇదేమైనా ప్రయత్నమా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా విజయ్‌ టర్న్‌ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ స్కెచ్‌ అయ్యి ఉంటుందా అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఏది ఏమైతేనేం మొత్తానికి అజిత్‌.. విజయ్‌ ల ఫ్యాన్స్‌ మద్య కాస్త వైరం అయినా తగ్గుతుందని తమిళ సినీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ వ్యాఖ్యలపై అజిత్‌ రియాక్షన్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.