Begin typing your search above and press return to search.

డివైడ్ టాక్.. ఒక్క రోజులో 28 కోట్లు

By:  Tupaki Desk   |   16 April 2016 3:30 PM GMT
డివైడ్ టాక్.. ఒక్క రోజులో 28 కోట్లు
X
తమిళ సూపర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ‘పులి’ లాంటి డిజాస్టర్ మూవీతో కూడా రూ.100 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టిన విజయ్.. డివైడ్ టాక్ తో మొదలైన తన కొత్త సినిమా ‘తెరి’తో మరోసారి తన పవర్ చూపించాడు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.28.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. మన తెలుగులో మాదిరి తమిళంలో బెనిఫిట్ షోలేమీ లేవు. అక్కడ అలాంటి షోలకు అనుమతి ఉండదు. పైగా ‘తెరి’ చెంగల్పట్ అనే ఓ పెద్ద ఏరియాలో ఓ వివాదం కారణంగా విడుదల కాలేదు.

ఇక తెలుగు వెర్షన్ ఎలాగూ ఒక రోజు ఆలస్యంగా రిలీజైంది. అయినప్పటికీ తొలి రోజు రూ.28 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం అంటే మాటలు కాదు. వేర్వేరు భాషల్లో కాకుండా ఓ తమిళ సినిమా.. తమిళంలో మాత్రమే సాధించిన వసూళ్లలో ఇది రికార్డు. తొలి రోజు డివైడ్ టాక్ ను తట్టుకుని ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం మామూలు విషయం కాదు. అందుకే రజినీకాంత్ తర్వాత సౌత్ లో బిగ్ స్టార్ విజయే అంటారు అతడి అభిమానులు.

తమిళ సంవత్సరాది రోజున.. గురువారం విడుదలైన ‘తెరి’కి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ గా మారింది. తొలి వారాంతం ముగిసేసరికి ఈ సినిమా భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉన్నా.. ఆలోపే బయ్యర్ల పెట్టుబడిలో చాలా వరకు రికవర్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ‘తెరి’ తెలుగు వెర్షన్ ‘పోలీస్’కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. దిల్ రాజు పెట్టుబడికి కూడా ఢోకా లేకపోవచ్చని అంటున్నారు.