Begin typing your search above and press return to search.
విజయ్ - సుకుమార్.. మధ్యలో అల్లు అర్జున్..!!
By: Tupaki Desk | 18 Feb 2021 7:00 AM ISTవిజయ్ దేవరకొండ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కేదార్ అల్లు అర్జున్ కి స్నేహితుడు అని తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ సెట్ చేసింది కూడా బన్నీనే అనే టాక్ ఉంది. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న 'లైగర్' సినిమా కంప్లీట్ అయిన తర్వాత సుక్కూ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు లైన్ లోకి రావడంతో ఈ ప్రాజెక్ట్ మీద నీలి మేఘాలు కమ్ముకున్నాయని.. విజయ్ దేవరకొండను డైలమాలోకి నెట్టేసిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే 'పుష్ప' తరువాత సుకుమార్ మైత్రీ టీమ్ తో మరో సినిమా చేయాల్సి ఉందట. ఇప్పుడు మైత్రీ వాళ్ళు హీరోని సెట్ చేస్తే సుకుమార్ అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడప్పుడే హీరో సెట్ కాకపోతే బయటికి వచ్చి వీడీతో సినిమా చేసుకోవచ్చు. కాకపోతే సుకుమార్ బయటకు వచ్చేసినా మైత్రి టీమ్ విజయ్ ని వదులుకునేలా లేరు. ఎందుకంటే 'డియర్ కామ్రడ్' తర్వాత విజయ్ మరో సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడని టాక్. ఇదే కనుక నిజమైతే 'లైగర్' తరువాత మైత్రి సంస్థలోనే వీడీ సినిమా చేయాలి. ఈ నేపథ్యంలో సుక్కు - విజయ్ ప్రాజెక్ట్ కి కేదార్ - మైత్రీ మూవీ మేకర్స్ లలో ఎవరు నిర్మాత అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఇదే కనుక ఇష్యూగా మారితే ఇద్దరు నిర్మాతలకు సన్నిహితుడైన బన్నీ మధ్యవర్తిగా మారి డీల్ చేస్తాడేమో చూడాలని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.