Begin typing your search above and press return to search.

లవ్లీ ప్రొడ్యూసర్ కి 'లైగర్' విజయ్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్..!

By:  Tupaki Desk   |   17 May 2021 3:30 PM GMT
లవ్లీ ప్రొడ్యూసర్ కి లైగర్ విజయ్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్..!
X
సీనియర్ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బబ్లీ బ్యూటీ.. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఊపేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఛార్మి.. తెలుగుతో పాటు మలయాళ కన్నడ హిందీ సినిమాలలోనూ నటించింది. ఈ క్రమంలో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తో కలిసి 'పూరీ కనెక్ట్స్‌' అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ - పూరీ కాంబినేషన్ లో ''లైగ‌ర్'' అనే పాన్ ఇండియా సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇవాళ సోమవారం ఛార్మీ పుట్టినరోజును జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లవ్లీ ప్రొడ్యూసర్ ఛార్మీ కి హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్ అందించారు. ఫ్లవర్స్ తో అలంకరించిన బర్త్ డే గిఫ్ట్ తో పాటుగా గూడీస్ ని పంపించిన విజయ్.. 'హ్యాపీ బర్త్ డే ఛార్మి, ఫుల్ లవ్' అని గ్రీటింగ్ కార్డ్ మీద రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించిన ఛార్మి.. 'థాంక్స్ మై లైగర్ విజయ్ దేవరకొండ' అని పోస్ట్ పెట్టింది. ఇకపోతే విజయ్ దేవరకొండ కూడా ఇటీవలే పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా విషెస్ అందించిన ఛార్మి.. 'ఒక్క మాట‌లో నిన్ను డిఫైన్ చేయాలంటే 26 క్యారెట్ల బంగారం' అంటూ విజయ్ కు కితాబిచ్చింది.