Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కి సొంత సినిమా కంటే పరాయి సినిమానే ఎక్కువయ్యిందా?

By:  Tupaki Desk   |   10 Jan 2023 9:50 AM GMT
సూపర్ స్టార్‌ కి సొంత సినిమా కంటే పరాయి సినిమానే ఎక్కువయ్యిందా?
X
తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ వారసుడు తమిళంతో పాటు తెలుగు లో కూడా తెరకెక్కింది. కొన్ని సన్నివేశాలను తమిళం మరియు తెలుగు వర్షన్ లకు వేరు వేరుగా చిత్రీకరించారని సమాచారం అందుతోంది. విజయ్‌ వారసుడు సినిమాను ఒక తెలుగు సినిమాగానే తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో దిల్‌ రాజుకు విజయ్ చుక్కలు చూపిస్తున్నారు.

తమిళనాట ఒక ఆడియో వేడుకలో విజయ్ పాల్గొన్నాడు. అంతుకు మించి వారసుడు సినిమా కోసం విజయ్‌ మీడియా ముందుకు రాలేదు. తెలుగు లో కూడా ఈ సినిమా వేరుగా రూపొందింది కనుక ఇక్కడ ప్రమోషన్ కార్యక్రమాలకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేదు.

దిల్‌ రాజు నిన్న ప్రెస్ మీట్‌ లో విజయ్ ని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

హైదరాబాద్‌ కు విజయ్ ని తీసుకు రావడం తర్వాత సంగతి. కనీసం ఆయన ట్విట్టర్‌ హ్యాండిల్ లో వారసుడు సినిమా తెలుగు వర్షన్ యొక్క ట్రైలర్ ను కూడా షేర్ చేయించ లేక పోయాడు దిల్ రాజు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విజయ్‌ ట్విట్టర్ లో తాజాగా బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ యొక్క పఠాన్ సినిమా ట్రైలర్‌ ను షేర్‌ చేయడం జరిగింది.

విజయ్‌ కి పఠాన్ సినిమా పై ఉన్న ఆసక్తి తన సొంత సినిమా తెలుగు వర్షన్‌ వారసుడు పై లేక పోయింది అంటూ విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వారసుడు సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రచారం జరగలేదు.

ఇప్పటికే ట్రైలర్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో పబ్లిసిటీ ఇలా డల్ గా ఉంటే పరిస్థితి ఏంటో అంటూ దిల్‌ రాజు సన్నిహితులు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.