Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటున్న తుగ్లక్ దర్బార్ ఫస్ట్ లుక్..!!

By:  Tupaki Desk   |   8 July 2020 5:32 PM GMT
ఆకట్టుకుంటున్న తుగ్లక్ దర్బార్ ఫస్ట్ లుక్..!!
X
పిజ్జా తెలుగు అనువాద చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో విజయ్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. పిజ్జా సినిమా తర్వాత విజయ్ నుండి చాలా సినిమాలే తెలుగులోకి అనువాదమై రిలీజ్ అయ్యాయి. ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసి.. ప్రస్తుతం స్టార్ హీరోగా ఆయన ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం. ఇటీవలే ఆయన సూపర్ డీలక్స్, 96 సినిమాలతో మంచి ఊపులో ఉన్నాడు. అంతేగాక గతేడాది మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి సినిమాలో కూడా మెప్పించాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే రంగు.. గ్లామర్ అవసరం లేదు.

కేవలం నటన.. టాలెంట్ ఉంటే సరిపోతుందని నిరూపించాడు విజయ్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా 'తుగ్లక్ దర్బార్'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సోషల్ మీడియాలో తుగ్లక్ దర్బార్ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అతిథిరావు హైదరి, మంజిమ మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ లుక్ పోస్టర్ లో విజయ్ ఇంటెన్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం విజయ్ అభిమానులకు పెద్ద పండగ వాతావరణం తీసుకొచ్చిందని చెప్పాలి. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ తుగ్లక్ దర్బార్ మరి ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో తెలియాల్సి ఉంది.