Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా విజయ్‌ మైనపు బొమ్మలే

By:  Tupaki Desk   |   3 Dec 2018 7:58 AM GMT
ఎక్కడ చూసినా విజయ్‌ మైనపు బొమ్మలే
X
తమిళనాట ఒక హీరోను లేదా హీరోయిన్‌ ను ఆరాధిస్తే ఏ స్థాయిలో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో హీరోలకు హీరోయిన్స్‌ కు గుడి కట్టి మరీ పూజించేవారు. ఇప్పుడు గుడి కట్టేందుకు ముందుకు రాకునాన అంతకు మించిన అభిమానంను చూపుతూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో తమ అభిమాన హీరో లేదా హీరోయిన్‌ ను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్ట్‌ లు చేయడం, అభిమాన సంఘం పేరుతో చిత్ర విచిత్రమైన పనులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా విజయ్‌ సేతుపతికి కూడా ఆయన అభిమానులు నిరాజనాలు పలుకుతున్నారు.

‘96’ అనే చిన్న చిత్రంతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ను దక్కించుకున్న విజయ్‌ సేతుపతి ప్రస్తుతం ‘సీతాకది’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రంలో ముసలి వ్యక్తి పాత్రలో విజయ్‌ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ దక్కింది. అయితే కొందరు మాత్రం భారతీయుడు లో కమల్‌ హాసన్‌ లా ఉన్నదనే విమర్శలు కూడా చేస్తున్నారు. విమర్శల కంటే ప్రశంసలు ఎక్కువ దక్కుతున్న నేపథ్యంలో విజయ్‌ సేతుపతి ఆ లుక్‌ మైనపు బొమ్మను చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ముఖ్య నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

షాపింగ్‌ మాల్స్‌ మరియు ముఖ్య ఏరియాల్లో విజయ్‌ సేతుపతి మైనపు బొమ్మకు మంచి ఆధరణ దక్కుతుంది. సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ రావడంతో పాటు - విజయ్‌ సేతుపతి క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. తమిళనాట విజయ్‌ సేతుపతి అభిమానులు మైనపు బొమ్మల వద్ద సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.