Begin typing your search above and press return to search.
పుష్ప నుండి విజయ్ తప్పుకోవడానికి కారణం ఫ్యాన్స్!!
By: Tupaki Desk | 18 April 2020 1:20 PM ISTఅల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రంలో మొదట కీలకమైన పాత్రకు గాను తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసిన విషయం తెల్సిందే. నెగటివ్ ఛాయలు ఉండే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని పుష్ప ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఈ సినిమా నుండి ఆయన తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరో టాక్ ప్రకారం ఈ సినిమా నుండి స్వయంగా సుకుమార్ ఆయన్ను తప్పుకోవాలంటూ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది.
పుష్ప చిత్రంను తెలుగుతో పాటు మరో అయిదు భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా తమిళం ఇంకా హిందీ ఆడియన్స్ ను సుకుమార్ టార్గెట్ చేయాలని ప్లాన్ చేశాడు. తమిళంలో స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతిని విలన్ గా చూపించడంను ఆయన ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అనే ఆలోచనతోనే పుష్ప చిత్రంలో నుండి ఆయన్ను సుకుమార్ తొలగించాడని కొందరు వాదిస్తున్నారు. విజయ్ ను విలన్ గా చూపించడాన్ని ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోకుంటే సినిమాకు అక్కడ కష్టం తప్పదనే ఉద్దేశ్యంతో సుకుమార్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అంటున్నారు.
విజయ్ సేతుపతి స్థానంలో భైరవ గీత హీరో ధనంజయను తీసుకునే ఉద్దేశ్యంలో సుకుమార్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ జరగడం లేదు. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే సుకుమార్ షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు ఈ పుకార్లన్నింటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈమె చిత్తూరు యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్ తో సుకుమార్ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.