Begin typing your search above and press return to search.

ఆకలికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టాలి: స్టార్ హీరో

By:  Tupaki Desk   |   6 May 2020 8:30 AM
ఆకలికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టాలి: స్టార్ హీరో
X
విజయ్ సేతుపతి.. ఈ తమిళనాడు హీరో కం నటుడు విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.పలు అవార్డులు సాధించాడు. హీరోగానే కాదు.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా విజయ్ సేతుపతి నటిస్తూ అలరిస్తున్నాడు. చిరంజీవి నటించిన ‘సైరా’లో కూడా విజయ్ నటించాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ‘ఉప్పెన’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

విజయ్ ఎంతో మంచి నటుడే కాదు.. సహృదయం గల నటుడని తమిళ ఇండస్ట్రీలో పేరుంది. సినిమాల గురించే కాదు.. పలు సామాజిక అంశాల గురించి విజయ్ సేతుపతి తరుచుగా స్పందిస్తుంటాడు. పలు వేదికలపై తన అభిప్రాయాలు కుండబద్దలు కొడుతుంటాడు.

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఉద్దేశిస్తూ విజయ్ సేతుపతి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘ఈ భూమి మీద ఆకలి అనే వ్యాధి ఎప్పటి నుంచో ఉంది. దానికి కూడా ఓ వ్యాక్సిన్ కనిపెడితే ఎంత బాగుంటుంది అని’ విజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తమిళనాట హాట్ హాట్ చర్చ చేస్తున్నాడు.