Begin typing your search above and press return to search.

త్రిష ఖాతాలోకి 96 కూడా!!

By:  Tupaki Desk   |   23 Dec 2016 10:30 PM GMT
త్రిష ఖాతాలోకి 96 కూడా!!
X
చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ ఇప్పుడు మామూలుగా టర్నింగ్ ఇచ్చుకోలేదు. కొన్ని నెలల క్రితం వరకు అసలు త్రిష కెరీర్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందనే టాక్ వినిపిస్తే.. ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులు సైన్ చేసేస్తోంది.

తాజాగా '96' అనే టైటిల్ పై రూపొందనున్న మూవీకి సైన్ చేసింది త్రిష. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతితో త్రిష తొలిసారిగా 96లోనే జోడీ కడుతోంది. 1990ల కాలం నాటి స్టోరీ కావడంతోనే.. ఈ టైటిల్ ను ఫైనల్ చేసుకున్నాడట దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఇది ఓ థ్రిల్లర్ బేస్డ్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. హీరో.. హీరోయిన్.. టైటిల్.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. ఇప్పటికే అంతా ఫైనల్ అయిపోవడంతో.. త్వరలో సెట్స్ పైకి వెళ్లిపోనందట ఈ చిత్రం.

ఇది కాకుండా త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే.. యంగ్ హీరోయిన్స్ బ్రెయిన్ గింగిరాలు తిరగాల్సిందే. మోహిని అంటూ ఓ హారర్ మూవీ.. చతురంగ వైట్టై2.. గర్జనై లు తమిళ చిత్రాలు కాగా.. హే జూడ్ అనే మలయాళ మూవీలో కూడా త్రిష నటించేస్తోంది. రీసెంట్ గా కోడి(తెలుగులో ధర్మయోగి) సక్సెస్ కావడం కూడా త్రిష క్రేజ్ మళ్లీ పీక్ స్టేజ్ కి పెరగాడనికి హెల్ప్ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/