Begin typing your search above and press return to search.

ఆ హీరో ఓకే చేసిన బయోపిక్ జాడే లేదే..!

By:  Tupaki Desk   |   30 May 2020 10:30 AM GMT
ఆ హీరో ఓకే చేసిన బయోపిక్ జాడే లేదే..!
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో పాటు బయోపిక్స్ ఎక్కువగా రూపొందుతున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. అన్నీ ఇండస్ట్రీలు ఇప్పుడు ఈ బయోపిక్‌ల ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల నుండి మొదలుకొని సినిమా హీరోలు, పేరుమోసిన రాజకీయ నేతల బయోపిక్స్ తెరపై దర్శనమిస్తున్నాయి. దర్శక నిర్మాతలు కూడా ఈ బయోపిక్స్ తెరకెక్కించడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా బయోపిక్ ల జోనర్ లోకి క్రికెటర్లు, బాక్సర్లు కూడా చేరారు. ఇండియాలో ఇదివరకే ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ల లైఫ్ స్టోరీలు సినిమాలుగా రూపొంది సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పటికే మరో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. 83 టైటిల్ తో రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతుంది. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి మరో క్రికెటర్ బయోపిక్ రానుంది. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ లైఫ్ స్టోరీని బయోపిక్ రూపంలో తెర మీదకి తీసుకు రాబోతున్నారు.

ఇందులో మురళీధరన్ క్యారెక్టర్ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పోషించనున్నారు. ఇదివరకే ఓకే చేసిన ఈ క్యారెక్టర్లో నటించడానికి విజయ్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడట. అయితే ఈ సినిమా బాలీవుడ్‌లో కాదు.. కోలీవుడ్‌లో రూపొందనుంది. శ్రీలంక బౌలర్ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మురళీధరన్. ప్రపంచవ్యాప్తంగా వన్డే మరియు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ కే దక్కింది. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ ను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. మురళీధరన్ అతని టెస్ట్ కెరీర్‌ లో 800 వికెట్లు పడగొట్టాడు. దీని ఆధారంగానే టైటిల్‌ ను ఖరారు చేశారట. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరిలోపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమా కూడా విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రస్తుత పరిస్థితులలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. అసలు జాడే లేదే అని సినీవర్గాలు అంటున్నాయి.