Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లా బుల్లితెరను షేక్ చేయ‌నున్న‌ సేతుప‌తి

By:  Tupaki Desk   |   21 March 2021 11:30 PM GMT
ఎన్టీఆర్ లా బుల్లితెరను షేక్ చేయ‌నున్న‌ సేతుప‌తి
X
త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో త‌మిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప‌రిశ్ర‌మ‌లోనూ చ‌క్క‌ని పేరు తెచ్చుకుంటున్నారు. దక్షిణాది ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ప్రస్తుతం అతను దక్షిణాదిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. త్వరలో బాలీవుడ్ ‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో కత్రిన కైఫ్ కీలక పాత్రలో న‌టిస్తోంది.

ఇదిలావుండగానే అత‌డు బుల్లితెర‌పైనా సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌నున్నాడ‌న్న‌ది కోలీవుడ్ క‌థ‌నం. సేతుపతి త్వరలోనే బుల్లితెర‌ ప్రపంచంలోకి హోస్ట్ గా అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ సన్ నెట్ వర్క్ విజయ్ సేతుపతితో కలిసి ఒక టీవీ షోను ప్లాన్ చేస్తోంది. సేతుపతి తొలి టీవీ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటికి వస్తాయి.

సన్ నెట్‌వర్క్ లోని జెమిని యంగ్ టైగర్ ఎన్‌.టి.ఆర్ హోస్ట్ గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు (ఇఎంకె) టీవీ షో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ టీవీ షోని అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌రుస‌గా టీజ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక సేతుప‌తి కూడా త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా తార‌క్ రేంజులోనే త‌మిళ బుల్లితెర‌ను షేక్ చేస్తాడ‌నే అంచ‌నా వేస్తున్నారు.