Begin typing your search above and press return to search.

'బీస్ట్' మూవీలో విజయ్ సేతుపతి కొడుకు కీ రోల్!

By:  Tupaki Desk   |   22 Feb 2022 10:32 AM GMT
బీస్ట్ మూవీలో విజయ్ సేతుపతి కొడుకు కీ రోల్!
X
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అక్కడ ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమా రికార్డులను తానే తిరిగి రాస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఒకదానికి మించి ఒకటి భారీ విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. ఆయన తాజా చిత్రంగా 'బీస్ట్' రూపొందింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకి చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి తనయుడు సూర్యను తీసుకున్నారట. ఆ కుర్రాడి పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గతంలో విజయ్ హీరోగా చేసిన 'తెరి' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మీనా కూతురు 'నైనిక' కనిపించింది. ఆ సినిమాకి ఆ పాప పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు విజయ్ సేతుపతి తనయుడి పాత్ర కూడా అలాంటిదేనని అంటున్నారు.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన 'అరబిక్ కుతూ' సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను హీరో శివకార్తికేయన్ రాయడం మరో విశేషం. ఇప్పడు కోలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. కెరియర్ ఆరంభంలో తమిళ సినిమా చేసిన పూజ హెగ్డే మళ్లీ ఆ వైపు చూడలేదు. తనకి స్టార్ డమ్ వచ్చిన తరువాత తమిళంలో తాను చేసిన సినిమా ఇది. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లోను ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక తెలుగులో పూజ హెగ్డే జోరు మామూలుగా లేదు. చరణ్ జోడీగా ఆమె చేసిన 'ఆచార్య' విడుదలకి ముస్తాబవుతోంది. ఇక ప్రభాస్ సరసన చేసిన 'రాధేశ్యామ్' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.

ఈ రెండు సినిమాల కోసం థియేటర్లు ఎదురుచూస్తుండగానే ఆమె మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. 'ఆచార్య' .. 'రాధేశ్యామ్' హిట్ కొడితే ఇక పూజా హెగ్డేను అందుకోడం కష్టమే!