Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ సినిమాలో అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. ఫ్యాన్స్ కు ఫుల్‌ కిక్‌

By:  Tupaki Desk   |   26 Feb 2022 6:30 AM GMT
సూపర్ స్టార్‌ సినిమాలో అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు.. ఫ్యాన్స్ కు ఫుల్‌ కిక్‌
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంలో విజయ్‌ తో పాటు విలన్ గా నటించిన విజయ్‌ సేతుపతి పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులు విజయ్‌ సేతుపతి లేకుంటే మాస్టర్ ని చూడ్డానికే లేదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. మాస్టర్‌ తో ఇద్దరు విజయ్‌ ల మద్య మంచి బంధం ఏర్పడింది.

మళ్లీ ఇద్దరు విజయ్ లు కలిసి ఎప్పుడెప్పుడు నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటి అంటే విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి తనయుడు సూర్య సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. విజయ్ సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా ఖచ్చితంగా మంచి గుర్తింపు దక్కుతుంది.

అలాంటిది బీస్ట్‌ సినిమాలో సూర్య సేతుపతి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది. అందుకే తప్పకుండా సూర్య అప్‌కమిట్ స్టార్‌ గా బీస్ట్‌ సినిమా తర్వాత మారిపోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని 12 ఏళ్ల బాలుడి పాత్ర కోసం సూర్య సేతుపతి మంచి ఎంపిక అనే ఉద్దేశ్యంతో అతడిని ఎంపిక చేశారనే వార్తలు తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

విజయ్ సేతుపతి మరే హీరో సినిమాలో అయినా సూర్య ను నటింపజేసేవాడో లేదో కాని విజయ్ బీస్ట్‌ సినిమా అవ్వడం వల్ల కాదనలేక పోయాడు. దర్శకుడు నెల్సన్‌ తో విజయ్ సేతుపతికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా కూడా సూపర్‌ స్టార్‌ సినిమాలో తన కొడుకు సూర్య సేతుపతి ని నటింపజేసి ఉంటారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్‌ సేతుపతి కూతురు శ్రీజ సేతుపతి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే తన సినిమా ద్వారానే శ్రీను విజయ్ సేతుపతి పరిచయం చేశాడు. కాని కొడుకును మాత్రం సూపర్‌ స్టార్‌ విజయ్‌ సినిమా ద్వారా పరిచయం చేయడం ద్వారా మంచి ఆరంభం ఇచ్చినట్లు అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ సేతుపతి కొడుకు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే వార్తలు తమిళ సినీ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

బీస్ట్‌ మేకర్స్ నుండి కాని విజయ్‌ సేతుపతి కాంపౌండ్‌ నుండి ఇప్పటి వరకు సూర్య సేతుపతి అఫిషియల్‌ ఎంట్రీ అనౌన్స్ మెంట్‌ అయితే రాలేదు. ఎప్పటికి ఆ వార్త అధికారికంగా వస్తుంది అనేది చూడాలి. సమ్మర్ కానుకగా రాబోతున్న బీస్ట్‌ సినిమా విడుదల అయ్యే వరకు కూడా విషయాన్ని రివీల్‌ చేయరేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరియు కూతురును అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విజయ్ సేతుపతి ముందు ముందు వారితో సినిమాలు చేయిస్తాడా అనేది చూడాలి.